విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ రివ్యూ

Vishwanath and Sons Trailer ReviewVishwanath and Sons Trailer Review


ప్యూర్ ఫ్యామిలీ ఎంటెర్టైనర్స్ కి కేరాఫ్ వెంకీ అట్లూరి నుంచి రాబోతున్న మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ విశ్వనాథ్ అండ్ సన్స్ ఆగష్టు 14 న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ చిత్రం తమిళనాట తెరకెక్కి తెలుగులో కూడా విడుదలకు సిద్దమైంది. తాజాగా మేకర్స్ విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వదిలారు.

హీరో సూర్య సంజయ్ విశ్వనాథ్ రోల్ లో కూల్ అండ్ క్లాసీ షూటర్ గా లుక్స్ వైజ్ గా సూపర్బ్ గా కనిపించారు. అంతే కూల్ గా సూర్య చెప్పిన మన డబ్బు, స్టేటస్, అన్నీ మనకు సౌకర్యాన్ని ఇవ్వాలి.. అహంకారం కాకూడదు, గెలిచేదాకా ఆగకూడదు.. గెలిచిన తర్వాత ఆ గెలుపు గురించి ఎక్కువ మాట్లాడకూడదు అంటూ చెప్పిన డైలాగ్స్ ట్రైలర్ కి హైలెట్ గా నిలిచాయి.

ఇక మమిత బైజు సూర్య లైఫ్ లోకి ఎంటర్ అవడం బాబు తోనే కాదు సూర్య తోనూ ప్రేమలో పడిపోవడం, ఇద్దరి మద్యన ఉన్న ఏజ్ గ్యాప్ తో వచ్చే ప్రోబ్లెంస్ ని దర్శకుడు వెంకీ అట్లూరి చాలా సున్నితంగా తెరకెక్కించారు. జీవి ప్రకాష్ మ్యూజిక్, సితార ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ అన్ని ఈ విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ కి రిచ్ గా అమరాయి.

ట్రైలర్ చూస్తుంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి పక్కాగా కనెక్ట్ అవడం ఖాయం. ఆగష్టు సెకండ్ వీక్ లాంగ్ వీకెండ్ ని విశ్వనాథ్ అండ్ సన్స్ క్యాష్ చేసుకోవడం పక్కా అని ఈ ట్రైలర్ చూస్తే ఇట్టే అర్ధమవుతుంది.

Vishwanath and Sons Trailer Released