రజినీకాంత్ సినిమాలో శ్రీలీల

Sreeleela Bags a Rajinikanth Movie!

 

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం జైలర్ 2 చిత్రాన్ని విడుదలకు రెడీ చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత రజినీకాంత్ కమల్ హాసన్ ప్రొడక్షన్ లో ధర్మాన్ చిత్రాన్ని చేస్తున్నారు. అయితే ఈ చిత్రంలో హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల నటించబోతుంది అనే వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. టాలీవుడ్ లో కనుమరుగవుతున్న ఈ బ్యూటీ కోలీవుడ్ లో గట్టిగానే పాగా వేస్తుంది.

టాలీవుడ్ లో వరస వైఫల్యాలు అమ్మడిని తెలుగు ప్రేక్షకులకు దూరంగా నెట్టేస్తుంది. కానీ తమిళనాట అమ్మడు కి రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. అక్కడ కూడా ఏమంత సక్సెస్ లేని శ్రీలీల కి తమిళనాట వరస ఆఫర్స్ తగులుతున్నాయి. ఇప్పటికే ధనుష్ తో నటించిన ఓమ్ చిత్రం విడుదలకు రెడీ అవుతుంది.

ఈలోపే సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో శ్రీలీల కు బంపర్ ఆఫర్ వచ్చింది అంటున్నారు. అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ధర్మాన్ చిత్రం లో కమల్-రజిని కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. 

Sreeleela is likely to join Rajinikanth Dharman