పొలం ప‌నుల నుంచి వెండితెర స్టార్ గా!

Pankaj Tripathi On IFFM HonourPankaj Tripathi On IFFM Honour

బాలీవుడ్‌లో తనదైన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు పంకజ్ త్రిపాఠి తన గతాన్ని, తొలిరోజుల్లో ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేసుకున్నారు. తాను  సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చానని, ప్రతిరోజూ ఉదయాన్నే పొలానికి వెళ్లి పనులు చేయడం తమ దినచర్యలో భాగమని  తెలిపారు. `గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్` చిత్రంతో కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరగడానికి ముందు.. తాను పడిన కష్టాలన్నీ కేవలం ఆ సినిమా కోసమే కాకుండా భవిష్యత్తు కోసం వేసిన పునాదులని  అభివర్చించారు.

సినిమా రంగంలోకి రాకముందు తాను గడిపిన ఆ కష్టకాలం వృథా పోలేదని.. అది ఒక విత్తనం మొలకెత్తే ప్రక్రియ లాంటిదని పంకజ్ త్రిపాఠి పేర్కొన్నారు. పొలంలో కష్టపడటం, జీవితంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కోవడం వల్లనే తనకు మనుషుల స్వభావాన్ని అర్థం చేసుకునే నేర్పు వచ్చిందన్నారు. ఆ అనుభవాలే నటుడిగా రాణించడానికి తనకు ఎంతో సహాయపడ్డాయని, ఆ నాటి కష్టాలే తనను నేడు ఈ స్థాయిలో నిలబెట్టాయని  భావోద్వేగంతో పంచుకున్నారు.

ప్రస్తుతం గ్లోబల్ స్థాయిలో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న పంకజ్ త్రిపాఠి, తన మూలాలను ఎప్పటికీ మరవనని నిరూపించారు. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి  అంకితభావం , ప్రతిభతో స్టార్ నటుడిగా ఎదిగిన ఆయన ప్రయాణం నేటి యువతకు ఎంతో స్పూర్తిదాయకం.

Pankaj Tripathi