సీఎం విజయ్ విడాకుల కేసులో బిగ్ ట్విస్ట్
Major twist in CM Vijay's divorce case
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. తన భర్త విజయ్ నుంచి విడిపోతున్నట్టుగా, విడాకులు కావాలని చెంగల్ పట్టు జిల్లా కోర్టులో పిటిషన్ వేసిన విజయ్ భార్య సంగీత అనూహ్యంగా తన భర్త నుంచి విడాకులు వద్దు, ఆయనతోనే కలిసి ఉండాలని ఉంది అంటూ విడాకులు వెనక్కి తీసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు విజయ్ కి మరొక నటితో సంబంధం ఉంది అంటూ డివోర్స్ నోటీసు పంపించడమే కాదు, విడాకులు వచ్చేవరకు విజయ్ ఇంట్లోనే తనని ఉండాలనివ్వాలని కోర్టుని కోరిన సంగీత ఇప్పుడు విడాకులు వద్దనుకోవడంతో చెంగల్ పట్టు జిల్లా కోర్టు విజయ్-సంగీత విడాకుల కేసుని కొట్టివేసింది.
మరి ఎలెక్షన్ అప్పుడు విజయ్ ని ఇరకాటంలో పెట్టడానికి సంగీత విడాకులు కోరి, ఇప్పుడు సీఎం అయ్యాక విడాకులు వద్దనుకుంటుందా, లేదంటే విజయ్-సంగీత నడుమ ఏమైనా రాజీ కుదిరిందా, కాదు పిల్లల కోసమే సంగీత ఈ డెసిషన్ తీసుకుందో తెలియదు కానీ ఈ విడాకుల విషయంలో విజయ్ ఇప్పటివరకు ఎక్కడా రియాక్ట్ అవ్వకపోవడం గమనార్హం.
విడాకుల పిటిషన్ ను వెనక్కు తీసుకున్న విజయ్ భార్య సంగీత, దానితో చెంగల్ పట్టు జిల్లా కోర్టు విజయ్-సంగీత విడాకుల కేసుని కొట్టివేసింది.







































