రూ. 10,000 కోట్ల క్లబ్‌పై నోలన్ కన్ను!

Nolan's The Odyssey

ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన విజువల్ వండర్ `ది ఒడిస్సీ` బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డుల వేటకు సిద్ధమైంది. ప్రతిదీ పక్కా ప్రణాళికతో అనుకున్నది సాధించే నోలన్.. ఈ గ్రీకు పురాణ గాథ కోసం ఏకంగా 250 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 2,100 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

గతంలో ఆయన అందించిన `ది డార్క్ నైట్` ($1.02 బిలియ‌న్), ‘ది డార్క్ నైట్ రైజెస్’ ($1.08 బిలియ‌న్) చిత్రాల తర్వాత మళ్లీ అదే స్థాయిలో 1 బిలియన్ డాలర్ (ప్రస్తుత మారకం విలువ ప్రకారం సుమారు రూ. 10,392 కోట్లు) క్లబ్‌లోకి అడుగుపెట్టడమే లక్ష్యంగా నోలన్ ఈ భారీ రిస్క్ చేశారు. విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన సానుకూల సమీక్షలు రావడం ఈ చిత్రానికి అతిపెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది.

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు థియేటర్లలో అందుతున్న రెస్పాన్స్ చూస్తుంటే నోలన్ బ్రాండ్ వాల్యూ ఏంటో మరోసారి స్పష్టమవుతోంది. బుక్‌మైషో సీఓఓ ఆశిష్ సక్సేనా తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ విపరీతంగా జరుగుతున్నాయి. విశేషం ఏంటంటే.. బుక్ అవుతున్న ప్రతి మూడు టికెట్లలో ఒకటి కచ్చితంగా ఐమాక్స్ (IMAX) స్క్రీన్‌దే కావడం విశేషం.

ప్రేక్షకులు సాధారణ థియేటర్ల కంటే పెద్ద స్క్రీన్లపైనే ఈ దృశ్య కావ్యాన్ని ఆస్వాధించాలని డిసైడ్ అయ్యారు. గతంలో నోలన్ సృష్టించిన `ఓపెన్‌హైమర్` ($960 మిలియన్లు), `ఇన్‌సెప్షన్` ($839 మిలియన్లు), `ఇంటర్‌స్టెల్లార్` ($731 మిలియన్లు) వంటి భారీ వసూళ్ల రికార్డులను తిరగరాస్తూ, `ది ఒడిస్సీ`ల‌ లాంగ్ రన్‌లో రూ. 10,000 కోట్ల మైలురాయిని సులభంగా అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

The Odyssey Movie