ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Anna Lezhneva Climbed 3550 Tirumala Alipiri Steps For Pawan Kalyan Health

పవన్ ఆరోగ్యం కోసం శ్రీవారి మెట్లెక్కిన భార్య అన్నా

Anna Lezhneva Climbed 3550 Tirumala Alipiri Steps For Pawan Kalyan Health


ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రీసెంట్ గా ముంబై కోకిలాబెన్ ఆసుపత్రిలో కుడి భుజానికి సర్జరీ చేయించుకుని వచ్చారు. పవన్ కళ్యాణ్ ని పరామర్శించేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా అందరూ ముంబై ఆసుపత్రికి వెళ్లొచ్చారు. పవన్ ఆసుపత్రి నుంచి హైదరాబాద్ కి రాగానే తెలంగాణ గవర్నర్ పవన్ ఇంటికొచ్చి ఆయన్ని పరామర్శించి వచ్చారు.

పవన్ కళ్యాణ్ ముంబై వెళ్లి టెస్ట్ లు చేయించుకుని, మళ్లీ సర్జరీకి వెళ్లిన సందర్భంలో ఆయన భార్య అన్నా లెజెనోవా ఆయన వెన్నంటే ఉన్నారు. భర్త పవన్ కళ్యాణ్ కి ఆమె సపర్యలు చెయ్యడమే కాదు.. ఆయన భుజం నెప్పితో ఎంతగా సఫర్ అయ్యారో చెప్పి బాధపడ్డారు. అంతేకాదు పవన్ కి సర్జరీ చేసిన డాక్టర్స్ కి ఆమె ప్రత్యేకంగా కృతఙ్ఞతలు తెలిపారు.

తాజాగా పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కుదుటపడాలని ఆమె వేంకటేశ్వరుడిని  మొక్కుకోవడమే కాదు అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు వెళ్లారు. చివరి మెట్టు వద్ద కొబ్బరి కాయ కొట్టిన అన్నా లెజ్‌నేవా.. అనంతరం నేరుగా వరాహస్వామి ఆలయంకు వెళ్ళి ప్రత్యేక పూజలు చేసారు.

గతంలో కూడా మెట్ల మార్గంలో నడుచుకుంటూ వచ్చి స్వామి వారిని దర్శించుకున్న పవన్ సతీమణి.. తల నీలాలు కూడా సమర్పించారు అప్పట్లో తన కుమారుడు స్కూల్ లో జరిగిన అగ్నిప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడడంతో శ్రీవారి చెంతకు అలిపిరి నుండి నడుచుకుంటూ వెళ్లి.. తలనీలాలు సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. ఇప్పుడు భర్త ఆరోగ్యం కోసం ఆమె మరోసారి మెట్ల మార్గం ద్వారా నడుచుకుంటూ శ్రీవారి దర్శనానికి వెళ్లారు.

Anna Lezhneva Attends Suprabhata Seva at Tirumala