ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Priyanka Chopra new look from Varanasi goes viral

వారణాసి నుంచి ప్రియాంక చోప్రా పవర్ ఫుల్ లుక్

Priyanka Chopra new look from Varanasi goes viral


దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి చిత్రం పై హాలీవుడ్ రేంజ్ లో అంచనాలున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా వారణాసి చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా మందాకినీ పాత్రలో కనిపించబోతుంది.

ఈరోజు జులై 18 ప్రియాంక చోప్రా బర్త్ డే. ప్రియాంక బర్త్ డే అంటే రాజమౌళి సినిమా నుంచి వచ్చే స్పెషల్ ఫుల్ లుక్ కోసం బాలీవుడ్ కూడా ఎదురు చూసింది. అందరి అంచనాలకు తగ్గట్టే వారణాసి నుంచి పవర్ ఫుల్ మందాకినీ లుక్ ని రాజమౌళి రివీల్ చేసారు. వారణాసి లో ప్రియాంక లుక్స్ తో పాటుగా ఆమె నవ్వితే అందం.. నవ్వకపోతే నిప్పు కణిక అనే క్యాప్షన్ పెట్టారు.

ప్రస్తుతం వారణాసి నుంచి వచ్చిన ప్రియాంక చోప్రా లుక్స్ చూసి అభిమానులే కాదు మహేష్ ఫ్యాన్స్, పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూ ఆమెకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. మరోపక్క సూపర్ స్టార్ మహేష్ కూడా మా ఒకే ఒక్క మందాకినికి హ్యాపీ బర్త్ డే.. అంటూ ఆమెకు విషెస్ తెలిపారు. 

Varanasi: Global Beauty gives Gooesbumps