ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Jason Sanjay reveals why he rejected Alphonse Puthren's film offer

స్టార్ హీరో ఎంట్రీపై క్లారిటీ అప్పుడే!

Jason Sanjay reveals why he rejected Alphonse Puthren's film offer

తమిళనాడు ముఖ్యమంత్రి , ద‌ళ‌ప‌తి విజయ్ కుమారుడైన జేసన్ సంజయ్ `సిగ్మా` అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతోన్న సంగ‌తి తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్ మరియు ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రచార గీతంలో జేసన్ సంజయ్ కనిపించడంతో?  ఆయన నటనపై ఆసక్తి చూపుతున్నారనే చర్చ మొదలైంది. అయితే దీనిపై సంజ‌య్ కొంత క్లారిటీ ఇచ్చారు. అది కేవలం సినిమా థీమ్ కోసం చేసిన ఒక ప్రచార గీతం మాత్రమేనన్నారు. ప్రస్తుతం  దృష్టంతా దర్శకత్వం పైనే ఉందని స్పష్టం చేశారు.

దర్శకత్వం వ‌హిస్తోన్న‌ సమయంలో సన్నివేశాలను వివరించేటప్పుడు తనలో కూడా ఒక నటుడు ఉన్నాడని జేసన్ సంజయ్ పేర్కొన్నారు. గతంలో దర్శకుడు అల్ఫోన్స్ పుత్రెన్ తనకు అవకాశం ఇచ్చినా?  అప్పుడు ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం దర్శకత్వం ఒక పెద్ద బాధ్యతగా భావిస్తున్నానని, సినిమా విడుదల తర్వాత మాత్రమే తాను నటుడిగా కొనసాగాలా ?  దర్శకుడిగా ముందుకు వెళ్లాలా?  అనే అంశంపై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.

`సిగ్మా` చిత్రం విడుదలకు సిద్ధమవుతోన్న వేళ విజయ్ నటించిన `జన నాయగన్` సినిమాతో క్లాష్ వచ్చే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. సెన్సార్ బోర్డు సమస్యల కారణంగా వాయిదా పడిన `జన నాయగన్` జూలై 23న విడుదల కానుంది. దీంతో `సిగ్మా` విడుదల తేదీలో మార్పులు ఉండవచ్చని సమాచారం. జేసన్ సంజయ్  మొదటి సినిమాతో ఎలాంటి  విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Jason Sanjay's Directorial Debut