ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Rakul Backs Tollywood, Slams Negative PR in Bollywood -

బాలీవుడ్ కన్నా టాలీవుడ్ బెస్ట్-రకుల్

Rakul Backs Tollywood, Slams Negative PR in Bollywood -


సౌత్ లో హీరోయిన్స్ గా పేరు తెచ్చుకుని బాలీవుడ్ కి వెళ్లి అక్కడి అవకాశాల కోసం టాలీవుడ్ ని కించపరిచే హీరోయిన్స్ ని చాలామందిని చూసాం. తాప్సి, రీసెంట్ గా తమన్నా లాంటి వాళ్ళు టాలీవుడ్ ని టార్గెట్ చేస్తూ చేసిన విమర్శలు అన్ని ఇన్ని కావు. ఇక్కడే హీరోయిన్స్ గా కెరీర్ స్టార్ట్ చేసి ప్రస్తుతం అవకాశాలు దొరక్క హిందీకి వెళ్లి అందాలు ఆరబోస్తున్న ఈ భామలు ఏరు దాటాక తెప్ప తగలేసినట్టుగా బిహేవ్ చేశారు.

అయితే సౌత్ లో ఓ వెలిగి వెలిగి స్టార్ హీరోలతో సినిమాలు చేసి టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుని ఇక్కడ అవకాశాలు తగ్గగానే హిందీకి వెళ్లి ముంబై లో సెటిల్ అయిన రకుల్ ప్రీత్ మాత్రం టాలీవుడ్ పై ప్రశంశల జల్లు కురిపిస్తుంది. బాలీవుడ్ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీ ఐక్యంగా ఉంటుంది.

బాలీవుడ్ లో నటుల మధ్యన ఈర్ష్య, అసూయ, అభద్రతా భావం ఎక్కువగా ఉంటాయి.. బాలీవుడ్ లో ఒకరి సినిమాలకు మరొకరు సపోర్ట్ చేసుకోరని రకుల్ ప్రీత్ అభిప్రాయపడింది. ఒకరి సినిమాలపై మరొకరు నెగిటివ్ ప్రచారం కూడా చేసుకుంటారని, బాలీవుడ్ లో ఒకరినొకరు తొక్కేయడమే అక్కడి వాళ్లకు తెలుసు అంటూ రకుల్ ప్రీత్ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

అదే టాలీవుడ్ లో అయితే ఒకరి సినిమాని మరొకరు సపోర్ట్ చేసుకుంటారు, ఒకరి సినిమా ట్రైలర్ ని, సినిమాలను మరొక స్టార్ పొగుడుతూ ట్వీట్లు వేస్తారు. బాలీవుడ్ కన్నా టాలీవుడ్ బెస్ట్ అంటూ రకుల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ గా చక్కర్లు కొడుతున్నాయి.

Rakul Preet Singh about the Unity in Telugu Cinema