ప్రభాస్ 3 నెలల గ్యాప్ లో రెండు ట్రీట్స్
Two Movies Of Prabhas In 3 Months?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ ఏడాది రాజసాబ్ తో అభిమానులను బాగా డిజప్పాయింట్ చేసారు. ది రాజసాబ్ ఫలితం తర్వాత ప్రభాస్ చాలా సీరియస్ గా తన తదుపరి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ పై ద్రుష్టి పెట్టారు. స్పిరిట్ అలాగే ఫౌజీ చిత్రాలను ప్రభాస్ కంటిన్యూ గా షూటింగ్ చేస్తూ వాటిని పూర్తి చేసే పనిలో ఉన్నారు.
దర్శకులు సందీప్ వంగ, హను రాఘవపూడి కూడా ప్రభాస్ డేట్స్ ని వాడుకుంటూ షూటింగ్ ని పరుగులు పెట్టిస్తున్నారు. స్పిరిట్, ఫౌజీ రెండు చిత్రాల షూటింగ్స్ ని ప్రభాస్ బ్యాలెన్స్ చేసుకుంటూ విరామమే లేకుండా పని చేసున్నారు. ఇక దసరా కు విడుదల అనుకున్న ఫౌజీ డిసెంబర్ 3 కి షిఫ్ట్ అయ్యింది. డిసెంబర్ 3 ఫౌజీ రిలీజ్ అంటూ మేకర్స్ ప్రకటించారు.
కల్ట్ డైరెక్టర్ సందీప్ వంగ తెరకెక్కిస్తున్న స్పిరిట్ 2027 మార్చ్ 5 విడుదల. అంటే ఫౌజీ వచ్చిన మూడు నెలల గ్యాప్ లో స్పిరిట్ విడుదల కాబోతుంది. సందీప్ వంగ మాత్రం స్పిరిట్ ని అనుకున్న సమయానికే విడుదల చేసి చూపించేలా ఉన్నారు. అంటే ప్రభాస్ ఫ్యాన్స్ కి మూడు నెలల గ్యాప్ లో రెండు భారీ ట్రీట్స్ ఉండబోతున్నాయన్నమాట.







































