ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Social media buzz drives moviegoers into the theaters

సోషల్ మీడియా బజ్ వర్కౌట్ అవ్వలే

Social media buzz drives moviegoers into the theaters


ఈమధ్యన కొంతమంది ప్రేక్షకులు సోషల్ మీడియా ముఖ్యంగా ట్విట్టర్ X లో పడుతున్న ట్వీట్లు చూసి సినిమాపై ఆసక్తిని చూపిస్తూ థియేటర్స్ కి వెళుతున్నారు. అందులో కొన్ని సినిమాలు వర్కౌట్ అయినా.. కొన్ని సినిమాలు ఆడియన్స్ ని బాగా డిజప్పాయింట్ చేస్తున్నాయి. ఈమధ్య కాలంలో అలా ఓ సినిమా విడుదలకు ముందు సోషల్ మీడియాలో కనిపించిన బజ్ ఆడియన్స్ అంచనాలకు తగ్గట్టు లేదు.

అదే సత్యదేవ్ రావు బహదూర్. సూపర్ స్టార్ మహేష్ బాబు రావు బహదూర్ సినిమా బావుంది అని ట్వీట్ వేస్తె ఘట్టమనేని అభిమానులు థియేటర్స్ కి వెళ్లడం ఖాయం. మహేష్ బాబు రావు బహదూర్ పై రివ్యూ ఇవ్వడమే కాకుండా.. చాలామంది రావు బహదూర్ పై చేసిన ట్వీట్లు, సత్యదేవ్ ప్రమోషన్స్ అన్ని ఆ సినిమాని చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి కలిగి థియేటర్స్ కి క్యూ కట్టారు.

కానీ సోషల్ మీడియాలో రావు బహదూర్ పై వచ్చిన బజ్ కి చూసిన సినిమాకి పొంతన లేదు అంటూ ప్రేక్షకులు పెదవి విరిచారు. రావు బహదూర్ కి ఈ బజ్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. రావు బహదూర్ ధియేట్రికల్ కన్నా, కానీ ఓటీటీ లో బాగా ఆడుతుంది అంటున్నారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా బజ్ రావు బహదూర్ కి అసలు కలిసిరాకపోగా.. సినిమా చూసిన వారు అంచనాలకు తగ్గట్టు లేదు అంటూ మాట్లాడుకోవడం గమనార్హం.

Rao Bahadur Public Talk