ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Prabhas reveals why SS Rajamouli wanted him to keep a horse at home

రాజ‌మౌళి మాట కాద‌న‌లేక ఇంట్లోనే జంతువు!

Prabhas reveals why SS Rajamouli wanted him to keep a horse at home

ద‌ర్శ‌క‌శిఖ‌రం రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం `బాహుబలి` కోసం రెబ‌ల్ స్టార్  ప్రభాస్ క‌ష్టం వెలకట్టలేనిది.   పాత్రలో పరకాయ ప్రవేశం చేయడానికి  ప్ర‌భాస్  ఎంతో స‌న్న‌ధ‌మ‌య్యారు. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాల్లో అశ్వాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు రాజమౌళి ఏకంగా ఓ  గుర్రాన్ని ప్రభాస్ ఇంట్లోనే ఉంచుకోవాలని వింతైన సలహా ఇచ్చారు అన్న సంగ‌తి ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఇది వినడానికి వింతగా అనిపించినా? ప్రభాస్ ఆ సవాలును స్వీకరించారు. గుర్రాన్ని త‌న దారిలోకి తెచ్చుకునేందుకు డార్లింగ్ ఆ కండీష‌న్ కు క‌ట్టుబ‌డ‌క త‌ప్ప‌లేదు.

ఈ అనుభవం ప్రభాస్ కెరీర్‌లోనే  మర్చిపోలేని మలుపుగా నిలిచింది. ఒక గుర్రాన్ని  ఇంటి వద్ద ఉంచుకుని దాన్ని దగ్గరగా గమనించడం, దానికి అలవాటు పడటం వల్ల సినిమాలో గుర్రపు స్వారీ సన్నివేశాల్లో ప్ర‌భాస్ ఎంతో సహజంగా నటించగలిగారు. నటుడిగా త‌న  పాత్ర కోసం ఎంతటి కష్టానికైనా వెనుకాడకూడదని పాత్రలో జీవించడం అంటే  డైలాగులు చెప్పడం మాత్రమే కాదని ఆ పాత్రకు సంబంధించిన జీవనశైలిని కూడా అనుభవించాలని  నిరూపించారు.

దర్శకులు కథ కోసం నటుల నుంచి ఇలాంటి వినూత్నమైన ప్రయత్నాలను ఆశించడం కొత్తేమీ కాదు. అయితే అగ్ర హీరో అయినప్పటికీ రాజమౌళి అడిగిన చిన్న కోరికను సైతం గౌరవించి ప్రభాస్ దానిని అమలు చేయడం  అంకి తభావానికి నిదర్శనం. `బాహుబలి` ప్రపంచవ్యాప్తంగా ఘనవిజయం సాధించడానికి వెనుక ఉన్న ఇలాంటి చిన్న చిన్న కష్టాలే పెద్ద మహాకావ్యాన్ని నిర్మించాయి అనడంలో సందేహం లేదు.

Prabhas reveals SS Rajamouli wanted him to keep a horse at home for Baahubali