అనసూయ అదిరే ఫోజులు
Anasuya Bharadwaj's stunning appearance
యాంకర్ నుంచి నటిగా మారిన అనసూయ భరద్వాజ్ ఎప్పుడు వార్తల్లో నిలిచేందుకు ఇష్టపడుతుంది. అంతేగా నటనకు గ్యాప్ వస్తే అందరూ ఇట్టే మరిచిపోతారు. అందుకే సోషల్ మీడియాలో ఎప్పుడు హడావిడి చేస్తూ కనిపిస్తుంది. వరస సినిమాల్తో ఈమధ్యన బుల్లితెరకు గ్యాప్ ఇచ్చేసిన అనసూయ షాప్ ఓపినింగ్స్ మాత్రం నిత్యం బిజీనే.
నాగబంధం తో డిజప్పాయింట్ చేసిన అనసూయ ఈమధ్యన షాప్ ఓపినింగ్స్ లో హంగామా చేస్తుంది. వస్త్ర దుకాణాల రిబ్బన్ కటింగ్స్ తో అనసూయ రెండు చేతులా సంపాదిస్తుంది. తాజాగా ఆమె ఓ షాప్ ఓపినింగ్ కి వెళ్ళొచ్చింది. అందుకు సంబందించిన తన లుక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
లైట్ బ్లూ పట్టు చీరకి డార్క్ గ్రీన్ డిజైనర్ బ్లౌజ్ వేసి అదిరిపోయే ఫోటోలకు ఫోజులిచ్చింది. లూజ్ హెయిర్, చెవులకు పెద్ద పెద్ద జుంకీ లు పెట్టుకుని చేతులకు గాజులు లేకపోయినా అనసూయ అందాలను పొగడకుండా ఉండలేరు. మీరు కూడా అనసూయ శారీ పిక్స్ పై ఓ లుక్కెయ్యండి.







































