బాలయ్య చూపు డిసెంబర్ వైపు

NBK111 Eyeing December Release

 

నందమూరి నటసింహ బాలయ్య యంగ్ హీరోస్ తో సమానంగా ప్రాజెక్ట్స్ ని క్రేజీగా లైన్ లో పెడుతున్నారు. NBK 111 సెట్ పైన ఉండగానే కొరటాల శివ తో NBK 112 ప్రాజెక్ట్ ని మొదలు పెట్టేసారు. గోపీచంద్ మలినేని తో NBK 111 ప్రాజెక్ట్ లో బాలయ్య చాలా స్టైలిష్ గా యాక్షన్ చేస్తున్నారు.

బాలయ్య బర్త్ డే గ్లింప్స్ NBK 111 పై విపరీతమైన అంచనాలు పెంచేసింది. బాలయ్య జెసిబి ఫైట్ ని అభిమానులు బాగా ఎంజాయ్ చేసారు. ఈ చిత్రంలో మంచు మనోజ్ విలన్ రోల్ లో బాలయ్య ని ఢీ కొట్టబోతున్నారు. అయితే ఈ చిత్రాన్ని ముందుగా దసరా రిలీజ్ అన్నారు, తర్వాత 2027 సంక్రాంతి అన్నారు.

కానీ బాలయ్య మాత్రం తనకు కలిసొచ్చిన డిసెంబర్ పైనే కన్నేసినట్లుగా తెలుస్తుంది. సంక్రాంతి సీజన్ ఫుల్ అవడంతో బాలయ్య డిసెంబర్ నెలకే మొగ్గు చూపితునట్లుగా తెలుస్తుంది. అందుకే గోపీచంద్ మలినేని షూటింగ్ ని చకచకా చుట్టేస్తున్నారట. రీసెంట్ గానే బాలయ్య- కీలక నటులపై ముంబై లోని కొన్ని లొకేషన్స్ లో కీ సీన్స్  తెరకెక్కించారు.

ఈ సినిమాతో పాటుగా బాలయ్య ఆగస్టు నుంచి కొరటాల మూవీ సెట్ లోకి వెళ్లనున్నట్లుగా తెలుస్తుంది. 

Balakrishna-Gopichand Malineni Film Eyes December 2026 Release