మూడో పెళ్ళిలో రెండో భార్యకి ఆమిర్ ముద్దు
Aamir Khan Kissed Ex-Wife Kiran Rao At His Wedding
నిన్న ఆదివారం జులై 5 న బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్ ని తన నివాసంలోనే అంగరంగ వైభవంగా మూడో వివాహం చేసుకున్నారు. పెద్ద భార్య, రెండో భార్య, వారి పిల్లల సమక్షంలోనే గౌరీని ఆమిర్ ఖాన్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ముంబై లోని బాంద్రా లోని తన ఇంట్లోనే ఆమిర్-గౌరీ ల వివాహం చాలా గ్రాండ్ గా జరిగింది.
ఇక ఈ పెళ్ళిలో ఆమిర్ ఖాన్ తన మొదటి భార్య, రెండో భార్య కిరణ్ రావు, ఇంకా ఆమిర్ మొదటి భార్య పిల్లలు, రెండో భార్య కొడుకు, మరోపక్క గౌరీ స్ప్రాట్ మొదటి భర్త కొడుకు పాల్గొనడమే కాదు అందరూ చాలా హ్యాపీగా ఈ పెళ్ళిలో ఎంజాయ్ చేసిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆ వీడియోస్ అన్నిటిలో గ్రూప్ ఫోటో దిగుతున్న సమయంలో ఆమిర్ ఖాన్ రెండో భార్య కిరణ్ రావు ను ముద్దాడడం హాట్ టాపిక్ అయ్యింది. కిరణ్ రావు తో 18 ఏళ్ళ వివాహ బంధాన్ని ఆమిర్ విడాకులతో తెంచేసుకున్నారు. కిరణ్ రావు కి ఆమిర్ ముద్దు పెడుతున్న వీడియో చూసిన వారు ఆమిర్ ఖాన్ తమ మూడో పెళ్ళిలో రెండో భార్య కిరణ్ రావు ను ముద్దు పెట్టుకున్నారు అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.







































