తెలుగులో ఎందుకు రిలీజ్ చెయ్యలేదో?

Gatta Kusthi 2 Public talk


తమిళ హీరో విష్ణు విశాల్ హీరోగా ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా తెరకెక్కిన గట్టా కుస్తీ చిత్రాన్ని తెలుగులోనూ బాగా ప్రమోట్ చేసి మట్టి కుస్తీ గా విడుదల చేసారు. ఆ చిత్రానికి బ్లాక్ బస్టర్ టాక్ రాకపోయినా.. డీసెంట్ మూవీగా మిగిలింది. అలాంటి సినిమాకి విష్ణు విశాల్ సీక్వెల్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్ అంటే ఓకే కానీ.. యావరేజ్ సినిమాకి సీక్వెల్ అంటేనే విచిత్రంగా కనిపించింది.

గట్టా కుస్తీ కి సీక్వెల్ గట్టా కుస్తీ-2 ని తెరకెక్కించి గత శుక్రవారం విడుదల చెయ్యగా ఆది తమిళనాట యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. క్రిటిక్స్ కూడా సో సో రివ్యూస్, రేటింగ్స్ గట్టా కుస్తీ-2 కి ఇవ్వడంతో ఈసినిమా ప్లాప్ అనుకున్నారు. కానీ మొదటిరోజు కన్నా రెండోరోజు నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ గట్టా కుస్తీ-2 కి క్యూ కట్టారు.

ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈ చిత్రం బాగా కనెక్ట్ అవ్వడంతో కలెక్షన్స్ కూడా ఆటోమాటిక్ గా పెరిగాయి. అయితే ఈ చిత్రాన్ని ఎందుకో తెలుగులో రిలీజ్ చెయ్యలేదు. మట్టి కుస్తీ అప్పుడే యావరేజ్ అవడంతో ఇప్పుడు సీక్వెల్ ని రిలీజ్ చెయ్యలేదు. మరి ఈమధ్యన కరుప్పు, దృశ్యం 3 చిత్రాలకు తెలుగులో యావరేజ్ టాక్ వచ్చినా తెలుగు ఆడియన్స్ అద్భుతమైన కలెక్షస్ కట్టబెట్టారు.

ఇదే ఊపు లో గట్టా కుస్తీ-2 కూడా తెలుగులో రిలీజ్ అయినట్లయితే ఎంతో కొంత ప్రభావం చూపించేది. మరి విష్ణు విశాల్ ఆ దశగా ఎందుకు ఆలోచించలేదో అనేది తెలుగు ఆడియన్స్ కి అర్ధం కావడం లేదు.
 

Gatta Kusthi 2 theatre response