నందిని అప్పటివరకు వెయిట్ చేయాల్సిందేనా ?

Will Nandini Reddy wait for Samantha?


హిట్ ఇచ్చాక దర్శకులకు భారీ గ్యాప్ రావడం అనేది ఈమధ్య కాలంలో చాలా చూస్తున్నాం. ఇప్పుడు హిట్ ఇచ్చిన ఓ దర్శకురాలు కు కూడా వెయిటింగ్ తప్పేలా లేదు. కారణం హీరయిన్ అందుబాటులో లేకపోవడమే, ఆ దర్శకురాలు ఎవరో కాదు నందిని రెడ్డి. ఓ బేబీ తర్వాత అన్ని మంచి శకునములు చేసి ఆతర్వాత చాలా పెద్ద గ్యాప్ తో సమంత తో మా ఇంటి బంగారం చేసి హిట్ కొట్టారు నందిని రెడ్డి.

సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి తెరకెక్కించిన మా ఇంటి బంగారం బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. ఆ సక్సెస్ తర్వాత దానికి సీక్వెల్ ప్రకటించారు సమంత అండ్ రాజ్ నిడిమోరు. అయితే వెంటనే మా ఇంటి బంగారం చిత్రం సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ లేదు. కారణం మెయిన్ లీడ్ సమంత ప్రెగ్నెన్సీ. అందుకే ఆమె మెటర్నిటీ లీవ్ తీసుకున్నారు.

మరి సమంత తో మా ఇంటి బంగారం సీక్వెల్ స్టార్ట్ చెయ్యాలంటే నందిని రెడ్డి వెయిట్ చెయ్యాల్సిందే. లేదంటే ఆమె ఈలోపు మరో ప్రాజెక్ట్ చేసుకోవచ్చు కానీ.. నందిని రెడ్డి మా ఇంటి బంగారం సీక్వెల్ కోసమే టైమ్ స్పెండ్ చేసేలా కనిపిస్తున్నారు. చూద్దాం సమంత వచ్చేవరకు నందిని కి వెయిటింగ్ తప్పదేమో.

Nandini Reddy's Next Move Before Maa Inti Bangaaram 2