సూపర్ స్టార్ అంకితభావానికి స్టార్ డైరెక్టర్ కంట నీళ్లు!
When Bharathiraja broke down emotionally because of Rajinikanth’s dedicationదివంగత దర్శకుడు భారతీరాజా కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన `16 వయతినిలే` చిత్ర షూటింగ్ సమయాన జరిగిన ఓ భావోద్వేగ సంఘటనను రైటర్ వైరముత్తు తాజాగా గుర్తు చేసుకున్నారు. ఆ చిత్రంలో రజనీకాంత్ పోషించిన పాత్ర కోసం ఆయన చూపిన అంకితభావం సెట్స్‌లో అందరినీ కదిలించిందని పేర్కొన్నారు. రజనీకాంత్ పాత్రలో ఎంతగా లీనమయ్యారంటే? ఆయన నటనను చూసి భారతీరాజా ఒక్కసారిగా భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారన్నారు. ఒక కొత్త నటుడు పాత్ర కోసం ఇంతటి కష్టాన్ని, పరిణితిని ప్రదర్శించడం అప్పట్లో చిత్ర బృందాన్ని ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు.
రజనీకాంత్ అంటేనే కష్టానికి మరో పేరు అని ఈ సంఘటన మరోసారి నిరూపిస్తోంది. స్టార్‌డమ్ రాకముందు నుంచే రజనీ పాత్రలను ఎంత బాధ్యతాయుతంగా స్వీకరించేవారో? ఈ జ్ఞాపకాలు చెప్పకనే చెబుతున్నాయి. `16 వయతినిలే` చిత్రంలోని `పరకట్టై` పాత్రకు రజనీకాంత్ ప్రాణం పోశారని, ఆయన నటనా శైలి అప్పటికే ప్రత్యేకతను చాటుకుందని వైరముత్తు కొనియాడారు. అదృష్టం వల్ల మాత్రమే కాకుండా కఠిన శ్రమ, పాత్ర పట్ల చూపే అచంచలమైన నిబద్ధత వల్లే రజనీకాంత్ నేడు సూపర్ స్టార్ గా ఎదిగారని అభిప్రాయపడ్డారు.
భారతీరాజా వంటి అగ్ర దర్శకుడిని సైతం కన్నీరు పెట్టించగలిగారంటే? రజనీకాంత్ ఆ పాత్రకు ఎంతటి శక్తిని ఇచ్చి ఉంటారో ఊహించొచ్చు. ఈ చారిత్రాత్మక జ్ఞాపకం ఒక షూటింగ్ విశేషం మాత్రమే కాదు. నటనను ఒక తపస్సులా భావించే ప్రతి కళాకారుడికి ఇదొక పాఠం. నేటితరం నటులకు రజనీకాంత్ ప్రయాణం గొప్ప స్ఫూర్తిని అందిస్తుంది. కళాకారుడికి ప్రతిభ మాత్రమే కాదు. ఆ ప్రతిభను ప్రదర్శించేటప్పుడు చూపించే నిజాయితీ కూడా ఎంత ముఖ్యమో ఈ సంఘటన చాటిచెబుతోంది.







































