Advertisement

ఆగస్టు 22కి మెగా బ్లాస్ట్-కన్ ఫర్మ్ చేసిన థమన్

Thaman tweet about Mega 158


ఆగష్టు 22 మెగాస్టార్ బర్త్ డే. చిరు బర్త్ డే అంటే మెగా అభిమానులకు పండగే. రక్తదానాలు, కేక్ కటింగ్స్, బ్యానర్ లు కట్టడాలు అబ్బో మెగా ఫ్యాన్స్ సందడి మాములుగా ఉండదు. మెగా అభిమానులకు మరింత ఉత్సహాన్ని ఇవ్వడానికి మెగాస్టార్ నటించే సినిమాల అప్ డేట్స్ తో నిర్మాతలు ట్రీట్స్ సిద్ధం చేస్తారు.

ఈ ఆగస్టు 22 కి విశ్వంభర నుంచి ఏదో ఒక అప్ డేట్ ఖాయమే. కానీ మెగా 158 నుంచి కూడా మెగా బ్లాస్ట్ రాబోతున్నట్టుగా మెగా 158 మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ట్వీట్ చేసారు. #Mega158 🔫 చరిత్ర !! @KChiruTweets AUG 22 ND  కలుద్దాం 🔥 అంటూ థమన్ ట్వీట్ చేసి అంచనాలు పెంచేసారు.

బాబీ దర్శకత్వంలో చిరు నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ జెట్ స్పీడులో సాగుతుంది. 2027 సంక్రాంతి టార్గెట్ గా తెరకెక్కుతున్న మెగా 158 చిత్రం షూటింగ్ ఓ షెడ్యూల్ పొల్లాచ్చిలో ముగించుకుని హైదరాబాద్ కి చేరింది. ఈచిత్రంలో నివేదా పేతురాజ్ కీలక పాత్రలో కనిపిస్తుండగా.. అనశ్వర రాజన్ చిరు కుమార్తె పాత్రలో కనిపించబోతుంది.
 

Thaman's Cryptic Tweet Sparks Buzz Around Mega 158