దర్శకనిర్మతలను మాయ చేస్తున్న హీరోయిన్

Actress Preethi MukundanActress Preethi Mukundan


బ్లాస్ట్ చిత్రంతో ఒక్కసారిగా ఫామ్ లోకొచ్చిన హీరోయిన్ ప్రీతి ముకుందన్.. ఆ చిత్రంలో అర్జున్ కి కూతురుగా, కరాటే లో ఆరితేరిన అమ్మాయిగా బ్లాస్ట్ చిత్రంలోనీల పాత్రలో ప్రీతి ముకుందన్ నటనకు అభిమానులు ఫిదా అవుతున్నారు. థియేటర్స్ లో మిస్ అయిన ఆడియన్స్ ఈ బ్లాస్ట్ చిత్రాన్ని ఓటీటీ లో వీక్షించిన తర్వాత ప్రీతి ముకుందన్ నటనను పొగడకుండా ఉండలేకపోతున్నారు.

ప్రీతి ముకుందన్ సెటిల్డ్ పెరఫార్మెన్స్ కు ఆడియన్స్ ఆమె అభిమానులుగా మారటమే కాదు.. దర్శకనిర్మాతల కంట్లో పడినట్లుగానే కనిపిస్తుంది. బ్లాస్ట్ చిత్రం తో ఒక్కసారిగా పాపులర్ అయిన ప్రీతి ముకుందన్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా ఇనిపిస్తుంది. ఆ చిత్రంలో ఆమెది గ్లామర్ రోల్ కాదు, అయినా యూత్ ఆమె నటనను ప్రేమిస్తున్నారు.

కళ్ళతో హావభావాలు పలికిస్తూ ఆమె చేసిన యాక్షన్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి బ్లాస్ట్ తర్వాత ప్రీతి ముకుందన్ ని దృష్టిలో పెట్టుకుని చాలామంది దర్శకులు కథలు ప్రిపేర్ చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. చూద్దాం అమ్మడు అదృష్టం ఎలా ఉందొ అనేది.!

Preethi Mukundan