Advertisement

అఖిల్ తో ఎన్టీఆర్ ఇంటర్వ్యూ

NTR's interview with Akhil


అక్కినేని అఖిల్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన పేరు. మూడేళ్ళ తర్వాత సిల్వర్ స్క్రీన్ పైకి వస్తున్న అఖిల్ పై అభిమానుల్లో విపరీతమైన అంచనాలున్నాయి. అఖిల్ తన హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తో కలిసి లెనిన్ ప్రమోషన్స్ లో హడావిడి చేస్తున్నారు మూడేళ్ళ గ్యాప్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఓ చిన్న యాక్సిడెంట్ వల్ల తనెంత ఇబ్బంది పడ్డాడో అనే విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.

అన్ని వైపుల నుంచి లెనిన్ చిత్రంపై పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు లెనిన్ పై మరికాస్త అంచనాలు పెంచేందుకు కింగ్ నాగార్జున వేసిన ప్లాన్ కి అక్కినేని ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అఖిల్ కి కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ మంచి ఫ్రెండ్ అని లెనిన్ ప్రమోషన్స్ లో చెప్పాడు. అలాగే ఎన్టీఆర్ చాలా చిలిపి అని బాగా గిల్లుతాడంటూ మాట్లాడాడు.

తాజాగా లెనిన్ ప్రమోషన్స్ లో భాగంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో అఖిల్ ఇంటర్వ్యూ ఇప్పించబోతున్నారంటూ సోషల్ మీడియాలో అక్కినేని ఫ్యాన్స్ ఒకటే హడావిడి చేస్తున్నారు. LUGER X LENIN 💥💥 NTR’s interview with Akhil. 🔜 అంటూ నానా హడావిడి చేస్తున్నారు. మరి నిజంగా ఎన్టీఆర్ తో అఖిల్ ఇంటర్వ్యూ ఉంటే అది సంచలనమే అవుతుంది.

UGER X LENIN NTR's interview with Akhil