జీనత్ అమన్- సంజయ్ ఖాన్ వివాదంపై నోరు విప్పిన కుమార్తె!
Farah Khan Ali denies claims of Sanjay Khan assaulting Zeenat Amanపరిశ్రమలో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై పుకార్లు దశాబ్దాల పాటు సాగుతూనే ఉంటాయి. ప్రముఖ నటుడు సంజయ్ ఖాన్ కుమార్తె ఫరా ఖాన్ అలీ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన తండ్రి జీవితానికి సంబంధించిన పాత వివాదాలపై స్పష్టతనిచ్చారు. సోషల్ మీడియాలో ప్రచారమవుతోన్న కొన్ని ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు. తమ కుటుంబం ఎదుర్కొన్న క్లిష్ట సమయాల్లో బాలీవుడ్ మీడియా సృష్టించిన కథనాలు వాస్తవానికి ఎంత దూరంగా ఉన్నాయో? వివరించే ప్రయత్నం చేసారు. తన తండ్రి వ్యక్తిత్వాన్ని - ఆ కాలం నాటి పరిస్థితులను ఆమె పంచుకున్నారు.
గతంలో సంజయ్ ఖాన్ తనతో కలిసి నటించిన జీనత్ ఆమన్ నటిని ముస్లిం సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారనే వార్తలు వచ్చాయి. ఆ సమయంలో సంజయ్ ఖాన్‌కు అప్పటికే వివాహమై పిల్లలు ఉన్నప్పటికీ ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ పరిస్థితిని ఆమె తల్లి జరీన్ ఖాన్ ఎంతో హుందాగా ఎదుర్కొన్న తీరును ఫరా అభి నందించారు. తన తల్లి చూపిన మనోధైర్యం, ఆత్మవిశ్వాసమే తిరిగి వారి దాంపత్య బంధాన్ని నిలబెట్టడానికి కారణమయ్యాయన్నారు. అంతే తప్ప మీడియాలో ప్రచారమైనట్లుగా మహిళల మధ్య ఎలాంటి ఘర్షణలు జరగలేదని స్పష్టం చేశారు.
సెలబ్రిటీల జీవితాలలో జరిగే సంఘటనలను బయట ప్రపంచం నచ్చినట్లుగా మలుచుకుని ప్రచారం చేయడం సాధారణం. ఇలాంటి సున్నితమైన కుటుంబ విషయాలలో పిల్లలు తల్లిదండ్రుల గత పొరపాట్లను విమర్శిం చకుండా.. వారి పట్ల గౌరవాన్ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. కుటుంబ సభ్యుల మధ్య ఉండే పరస్పర అవగాహన, క్షమాగుణం బాహ్య ప్రపంచపు పుకార్ల కంటే ఎంతో శక్తివంతమైనవని ఈ ఉదంతం నిరూపిస్తుంది.








































