Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Social media's onslaught on celebrities' personal lives!

సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై సోషల్ మీడియా దాడి!

Social media's onslaught on celebrities' personal lives!

డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్రభావం ఎంత ఉందో?  వాటి ద్వారా సెలబ్రిటీలు ఎదుర్కొనే ప్రతికూల పరిస్థితులు అంతకంటే ఎక్కువగా ఉన్నాయ‌న్న‌ది కాద‌న‌లేని నిజం. తాజాగా బాలీవుడ్ నటి  దియా మీర్జా తన చిన్నారి కుమారుడి ప్రవర్తన విషయంలో సోషల్ మీడియాలో అనవసరమైన ట్రోలింగ్‌కు, విమర్శలకు గురయ్యారు. ఓ బహిరంగ వేదిక వద్ద ఆమె  కుమారుడితో ఉన్న సమయం, అతని అల్లరిని నెటిజన్లు భూతద్దంలో పెట్టి చూపిస్తూ తల్లిగా బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించడం లేదనే కోణంలో తీవ్రమైన విమర్శలు చేశారు. పసిబిడ్డ సహజమైన ప్రవర్తనను కూడా తప్పుగా అర్థం చేసుకుని విమర్శించడంపై  పరిశ్రమసైతం తీవ్ర ఆగ్ర‌హించింది.

ఈ వివాదంపై  రిచా చద్దా దియా మీర్జాకు బాసటగా నిలిచారు. దియా మీర్జా వంటి వ్యక్తి పట్ల సోషల్ మీడియా చూపుతున్న  అసహనం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. నెటిజన్లు ఏమాత్రం అవగాహన లేకుండా ఒక తల్లిగా దియా చేస్తున్న కృషిని విస్మరిస్తున్నారని మండిపడ్డారు. దియా మీర్జా  ఒక నటి మాత్రమే కాదు. పర్యావరణ పరిరక్షణ కోసం విశేషంగా కృషి చేస్తున్న గొప్ప మానవతావాది అని రిచా గుర్తు చేశారు. ఒక వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడే ముందు వారి వ్యక్తిత్వాన్ని, సమాజానికి వారు చేస్తున్న సేవను గుర్తించాలని రిచా హితవు పలికారు.

ఈ సందర్భంగా దియా మీర్జా పట్ల సాన్నిహిత్యాన్ని, ఆమెలోని గొప్ప మనసును రిచా చద్దా పంచుకున్నారు.  వివాహ సమయంలో దియా మీర్జా తనకు ఇచ్చిన ప్రత్యేక కానుకను గుర్తు చేసుకున్నారు. ఆమె ఎంతటి సున్నితమైన మనసున్న వ్యక్తి అని వెల్లడించారు. `దియా మీర్జా నాకు వివాహ కానుకగా ఏకంగా 1100 చెట్లను బహుమతిగా ఇచ్చారు. పర్యావరణంపై ఆమెకున్న ప్రేమను కొనియాడారు.

అలంకారప్రాయమైన వస్తువులను కాకుండా భూమికి ప్రాణాన్ని ఇచ్చే చెట్లను కానుకగా ఇచ్చే అంతటి ఉన్నత ఆలోచనలు కలిగిన దియాను విమర్శించడం దురదృష్టకరమని రిచా అభిప్రాయపడ్డారు. దియా మీర్జా సైతం ఈ వివాదం స్పందించింది.  బిడ్డ పెరుగుదలపై తనకు పూర్తి అవగాహన ఉందని, బయట వ్యక్తుల విమర్శలు  తల్లిత్వానికి కొలమానం కావని పరోక్షంగా సందేశం ఇచ్చారు. ఒక తల్లిగా  బిడ్డకు ఇవ్వాల్సిన సంరక్షణ, ప్రేమ విషయంలో తానెప్పుడు రాజీ పడన‌న్నారు.

Social Media and the Celebrity Effect