Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Akhil Akkineni Breaks Silence on his Terrible Injury

48 కుట్లు - 8నెలల రెస్ట్ అందుకే గ్యాప్ - అఖిల్

Akhil Akkineni Breaks Silence on his Terrible Injury

 

అక్కినేని ప్రిన్స్ అఖిల్ లెనిన్ చిత్రంతో మరో వారం రోజుల్లో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఏజెంట్ తర్వాత మూడేళ్ళ భారీ గ్యాప్ తో అఖిల్ లెనిన్ తో రాబోతున్నారు. అయితే ఈ మూడేళ్ల గ్యాప్ అఖిల్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనే విషయంలో అభిమానుల్లో రకరరకాల అనుమానాలు ఉన్నాయి.

లెనిన్ ప్రమోషన్స్ లో భాగంగా అభిమానుల అనుమానాలపై స్పష్టత ఇచ్చారు. మూడేళ్లు బ్రేక్ తీసుకున్నందుకు ఫ్యాన్స్ కి చాలా కోపంగా ఉంది. కానీ తాను ఏజెంట్ రిలీజ్ అయిన మూడు నెలల తర్వాత ఒక రోజు బాత్ రూమ్ లో అనుకోకుండా పడిపోయాను, ఆ ప్రమాదంలో గాజు ముక్కలు నా చేతికి బలంగా గుచ్చుకున్నాయి.

ఎడమ చేతి వేళ్లకు రెండు సర్జరీలు జరిగాయి. దానికి 48 కుట్లు పడ్డాయి. దాదాపుగా 8 నెలల పాటు బరువులు ఎత్తలేకపోయాను. ఆ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి నాకు 16 నెలలు పట్టింది. ఇకపై ఇలాంటి బ్రేక్ మరోసారి రాదు అని అభిమానులకు హామీ ఇస్తున్నట్టుగా అఖిల్ లెనిన్ ప్రమోషన్స్ లో ఫ్యాన్స్ ని కూల్ చేసే కామెంట్స్ చేసారు. 

Akhil Akkineni Apologizes to Fans After a 3-Year Gap