Advertisement

జన నాయగన్ కి సెన్సార్ అయ్యిందా?

Jana Nayagan clears censor

 

తమిళనాడు సీఎం అయ్యాక కూడా స్టార్ హీరో విజయ్ చివరి చిత్రానికి సెన్సార్ అవ్వకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. విజయ్ సీఎం అయిన నెక్స్ట్ మినిట్ జన నాయగన్ విడుదలవుతుంది అనుకున్నారు, విజయ్ ఫ్యాన్స్ అదే నమ్మకంతో ఉన్నారు. అయినప్పటికీ జన నాయగన్ కష్టాలు తీరలేదు.

తాజాగా జన నాయగన్ సెన్సార్ పూర్తయినట్లుగా తెలుస్తుంది. జన నాయగన్ చిత్రానికి సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ జారీ చేసినట్లుగా సమాచారం. మరి జన నాయగన్ కి సెన్సార్ సర్టిఫికెట్ వచ్చింది అంటే సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయినట్లే. మరి ఇప్పటికైనా జన నాయగన్ విడుదలవుతుంది అనే ఉత్సహంలో విజయ్ ఫ్యాన్స్ కనిపిస్తున్నారు.

జులై మిడ్ లో కానీ లేదంటే ఆగష్టు ఫస్ట్ వీక్ లో కానీ జన నాయగన్ విడుదల ఉండొచ్చని అంటున్నారు. ఇదే నిజమైతే విజయ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకోవడానికి రెడీ అవ్వాల్సిందే. 
 

Jana Nayagan May Release in July as Censor Clearance Nears