క్రేజీ న్యూస్ - బాహుబలి 3 కూడా..
Baahubali 3 on cards
బాహుబలి చిత్రం తో పాన్ ఇండియా మార్కెట్ లో బలమైన ముద్ర వేసిన రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ తో వారణాసి మూవీ తెరకెక్కిస్తున్నారు. బాహుబలి వచ్చి ఏళ్ళు గడుస్తున్నా ఏదో విధంగా ఆ చిత్రం వార్తల్లోనే ఉంటుంది. ఈరోజు నెట్ ఫ్లిక్స్ నుంచి బాహుబలి: ది టార్చ్ బేరర్ మూవీ స్ట్రీమింగ్ కి వస్తోంది.
ఈ ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్, రానా, అనుష్క లతో కూడిన వీడియోను పంచుకుంది నెట్ ఫ్లిక్స్. ఆ వీడియో లో రాజమౌళి సార్ ఇక్కడ లేకపోయినా కూడా ఈ విషయాన్ని చెప్పేస్తున్నానంటూ ప్రభాస్, రానా బాహుబలి పార్ట్-3 ఉందని రివీల్ చేశారు. అలా బాహుబలి 3పై అఫీషియల్ ప్రకటన వచ్చేసింది.
మరి బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2 తో ఇండియన్ బాక్సాఫీసు ని షేక్ చేసి.. పాన్ ఇండియా మార్కెట్ లో బిగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన రాజమౌళి బాహుబలి పార్ట్ 3 ఎన్ని సంచలనాలకు తెరలేపుతారో చూడాలి.
Baahubali 3 loading







































