ఇంత సైలెంట్ అయితే ఎలా మారుతి

Director Maruthi in silent mode

 

రాజా సాబ్ దెబ్బకి సైలెంట్ గా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన దర్శకుడు మారుతి శ్రీరామనవమి రోజున సడన్ గా తన కొత్త సినిమా పై కూర్చున్నట్టుగా అప్ డేట్ ఇచ్చారు. మరి మారుతి ఎవరి కోసం కథ ప్రిపేర్ చేసారు, ఆ కథ తో ఎవరిని ఒప్పించబోతున్నారు, ఈసారి మారుతి చేతికి చిక్కే హీరో ఎవరు అనే విషయంలో చాలామందిలో ఆసక్తి కనిపిస్తుంది.

మారుతి ఈమధ్యన రవితేజని కలిసారనే వార్త వైరల్ అయ్యింది. మరోపక్క మెగా హీరో ఎవరిని మారుతి లైన్ లో పెడతారో చూడాలి. మెగా కాంపౌండ్ నుంచే మారుతి బౌన్స్ బ్యాక్ అవ్వాలి. రాజసాబ్ మరక తొలగించుకోవడానికి చాలా కష్టపడాలి. పక్కా హిట్ కథతోనే ఈసారి సెట్ పైకి వెళ్ళాలి. దర్శకుడు మారుతి ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నారు.

ఎలాంటి అప్ డేట్స్ తన ఫ్రెండ్స్ తో కూడా ఇప్పించడం లేదు. రాజసాబ్ విషయంలో జరిగిన పొరబాటు ఈసారి రిపీట్ అవ్వకూడదు అని మారుతి కష్టపడుతున్నారు. ఈసారి మంచి సినిమా తియ్యకపోతే మారుతి కెరీర్ ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం లేకపోలేదు. చూద్దాం మారుతి ఎలాంటి మూవీ తో వస్తారో అనేది!

Director Maruthi's next update?