ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bhagyashri Borse enters Malayalam movies

హిట్ లేదు.. అయినా అవకాశాలు ఆగట్లేదు

Bhagyashri Borse enters Malayalam movies

 

భాగ్యశ్రీ బోర్సే.. ఈ భామ రవితేజ మిస్టర్ బచ్చన్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ సినిమానే డిజాస్టర్. అయినప్పటికి పలువురు యంగ్ హీరోలు తమ సినిమాల్లో ఛాన్స్ లు ఇచ్చారు. విజయ్ దేవరకొండ కింగ్ డమ్, రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రాల్లో అవకాశాలు వరించాయి. కానీ అవి కూడా భాగ్యశ్రీ బోర్సే కి విజయాన్ని అందించలేదు.

అందంతో, కట్టిపడేసే గ్లామర్ తో భాగ్యశ్రీ బోర్సే అవకాశాలు అందుకుంటుంది. ఇక ఇప్పుడు అఖిల్ లెనిన్ తో భాగ్యశ్రీ బోర్సే ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ చిత్రం అమ్మడుకు చాలా కీలకం. ఇక భాగ్యశ్రీ బోర్సే కి సక్సెస్ తో పని లేకుండా అవకాశాలు అందిపుచ్చుకుంది. ఇప్పటికే భాగ్యశ్రీ బోర్సే తమిళనాట అడుగుపెట్టింది. శివ కార్తికేయన్ సరసన సెయాన్ అనే మూవీ చేస్తుంది.

ఇప్పుడు భాగ్యశ్రీ బోర్సే మలయాళంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. అది కూడా మోహన్ లాల్ చిత్రంతో భాగ్యశ్రీ బోర్సే మలయాళ ఎంట్రీ ఉంటుందట. మరి అమ్మడుకి విజయాలు లేవు కానీ అవకాశాలు మాత్రం ఆగట్లేదు. మరి ఈ అందం, ఆ గ్లామర్ తో ఎంతవరకు నెట్టుకొస్తుందో చూడాలి. 

Bhagyashri Borse will play the female lead opposite Mohanlal movie