ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Ram Charan meets AP Dy CM Pawan Kalyan

బాబాయ్ అడుగుజాడల్లో అబ్బాయ్

Ram Charan meets AP Dy CM Pawan Kalyan


పెద్ది సక్సెస్ సెలెబ్రేషన్స్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిన్న బుధవారం సాయంత్రం అమరావతికి బయలుదేరి వెళ్లారు. అక్కడ తన బాబాయ్ పవర్ స్టార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని మీట్ అయ్యారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ వెనకాలే రామ్ చరణ్ నడవడం చూసిన వారంతా బాబాయ్ అడుగుజాడల్లో అబ్బాయ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

రామ్ చరణ్ అక్కడ అమరావతి క్రికెట్ స్టేడియం ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారు. బాబాయ్ పవన్ ని మీటై కాసేపు ముచ్చటించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ ప్రతి ఏడాది ఆచరించే చాతుర్మాస దీక్షను చేపట్టారు.

ఏటా జ్యేష్ఠ మాసంలో ప్రారంభించి, కార్తీక మాసంలో దీక్ష విరమిస్తారు. నిన్న బుధవారం ఉదయం మంగళగిరిలో శ్రీ పానకాల స్వామికి అర్చనలు చేయించి పవన్ కళ్యాణ్ దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో నియమితమైన జీవనంతోపాటు సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు. విధి నిర్వహణకు అనుగుణంగా వస్త్రాలు ధరిస్తారు. ఎక్కువగా చందన వర్ణ వస్త్రధారణను అవలంబిస్తుంటారు. ప్రస్తుతం పవన్ ఆ వస్త్రాల్లోనే కనిపించారు.

Ram Charan, Pawan Kalyan meet becomes talking point