ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Rajinikanth breaks silence on Vijay birthday greeting row

విజయ్ ని విష్ చేయకపోవడంపై రజిని రియాక్షన్

Rajinikanth breaks silence on Vijay birthday greeting row

 

తమిళనాడు సీఎం విజయ్ కి త్రిష బర్త్ డే విషెస్ చెప్పలేదు, వారిద్దరికీ బ్రేకప్ అయింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో పాటుగా సూపర్ స్టార్ రజినీకాంత్ విజయ్ ని విష్ చెయ్యకపోవడం పై కూడా రకరకాల ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. అసలే విజయ్ సీఎం అయ్యాక రజినీకాంత్ విజయ్ ని విష్ చెయ్యలేదు, ఆతర్వాత దానిపై క్లారిటీ ఇచ్చారు. ఇప్పడు విజయ్ బర్త్ డే కి ప్రముఖులు ట్వీట్లు వేసినా సూపర్ స్టార్ ట్వీట్ వెయ్యకపోవడము హాట్ టాపిక్ అయ్యింది.

ఈరోజు సూపర్ స్టార్ రజినీకాంత్-కమల్ హాసన్ ల కలయికలో తెరకెక్కుతున్న ధర్మన్ మూవీ ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చిన సూపర్ స్టార్ ని మీడియా వారు విజయ్ బర్త్ డే కి విష్ చెయ్యకపోవడం పై ప్రశ్నించారు. దానికి మేమిద్దరం అప్పుడే మాట్లాడుకున్నాం అని తమిళంలో క్లుప్తంగా సమాధానమిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అసలు సూపర్ స్టార్ కి విజయ్ సీఎం అవడం ఇష్టం లేదు, స్టాలిన్ కి సపోర్ట్ గా సూపర్ స్టార్ ఉంటున్నారనే వార్తలను అప్పడే ఖండించిన రజినీకాంత్ మరోసారి విజయ్ కి బర్త్ డే విషెస్ చెప్పకవడం పై కూడా స్పందించి క్లారిటీ ఇచ్చారు.

Rajinikanth clarifies why he did not post a birthday wish for CM Vijay