విజయ్-త్రిష మధ్య బ్రేకప్?

Did Vijay and Trisha break up?

 

కోలీవుడ్ స్టార్ హీరో కమ్ తమిళనాడు సీఎం విజయ్ తన భార్య సంగీత కు విడాకులు ఇచ్చి నటి త్రిష ను వివాహం చేసుకోబోతున్నారనే వార్తలకు బలం చేకూరుస్తూ విజయ్-త్రిష పదే పదే ఈవెంట్స్ లో కలిసి కనిపించారు. ఎన్నికల ముందు విజయ్ తో కలిసి ఓ పెళ్ళికి వెళ్లిన త్రిష ఆతర్వాత ఎలక్షన్స్ లో విజయ్ గెలుపొందారు అని తెలిసి ఆయన ఇంటికి వెళ్ళి మరీ విష్ చేసింది.

ఇక విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో త్రిష స్పెషల్ గా అలంకరించుకుని ఆ వేడుకలో అందరి కళ్ళు తనపైనే ఉండేలా చూసుకుంది. అంతేకాకుండా అజిత్ తల్లి మృతి చెందినప్పుడు సీఎం విజయ్ తో కలిసి త్రిష రావడం ఇవన్నీ వారి మద్యన ప్రేమ ఉందని రుజువు చేసాయి.

ఇక విజయ్ బర్త్ డే రోజు త్రిష వెయ్యబోయే ట్వీట్ కోసము, ఆమె చేసే విష్ కోసం చాలామంది వెయిట్ చేసారు. కానీ త్రిష విజయ్ ను విష్ చేయకపోగా.. ఇన్స్టా లో విజయ్ ని అన్ ఫాలో చెయ్యడం షాకిచ్చింది. త్రిష విజయ్ నుంచి ఎందుకు దూరమైంది, కావాలనే విజయ్ ని అన్ ఫాలో చేసిందా, వారి మధ్యన బ్రేకప్ అయ్యిందా అసలు విజయ్, త్రిష మధ్యలో ఏం జరుగుతుంది అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.
 

Trisha skips Vijay’s birthday wish on social media