బుచ్చి కి వెయిటింగ్ తప్పదు

Buchi Babu to take a breakBuchi Babu to take a break

 

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ హిట్ కొట్టిన దర్శకులకే తదుపరి సినిమా చెయ్యడానికి బాగా గ్యాప్ వచ్చేస్తున్న ఈ రోజుల్లో ఉప్పెన సినిమా తర్వాత చాలా ఏళ్లకు రామ్ చరణ్ తో పెద్ది చిత్రాన్ని తెరకెక్కించిన బుచ్చి బాబు కి తదుపరి చిత్రానికి వెయిటింగ్ తప్పేలా కనిపించడం లేదు. పెద్ది ఏమంత బ్లాక్ బస్టర్ హిట్ కాదు.

అందులోను బుచ్చి బాబు దర్శకత్వంపై  విమర్శలు వినిపించాయి. పెద్ది చిత్రాన్ని బుచ్చి బాబు సరిగా హ్యాండిల్ చెయ్యలేకపోయాడు, హీరోయిన్ విషయంలో బుచ్చి బాబు పై తీవ్ర విమర్శలు వచ్చాయి. రెండో సినిమానే పెద్ద హీరోతో చేసిన బుచ్చి బాబు ని నమ్మి ఇప్పుడు మూడో ఛాన్స్ ఎవరిస్తారు.

స్టార్ హీరో ని పట్టుకోవడం కష్టమే, ఈసారి సుక్కు రికమండేషన్ కూడా కష్టమే. మరి బుచ్చి బాబు మూడో సబ్జెక్టు ని చాలా స్ట్రాంగ్ పాయింట్ తో హీరోలను కన్విన్స్ చెయ్యాల్సి ఉంటుంది. అది అంత త్వరగా అయ్యే పని కాదు. అందుకే బుచ్చి బాబు కి వెయిటింగ్ తప్పదు అనేది.

Buchi Babu to take a break before he kickstarts his next