వారణాసి హక్కుల కోసం డిస్కర్షన్స్

Discussions regarding Varanasi rightsDiscussions regarding Varanasi rights

 

దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ హీరోగా తెరకెక్కిస్తున్న వారణాసి చిత్ర షూటింగ్ జెట్ స్పీడులో చక్కబెడుతున్నారు. ఆఖరికి మహేష్ సమ్మర్ వెకేషన్ కి కూడా వెళ్లకుండా వారణాసి షూటింగ్ కోసమే సమయం వెచ్చించారు. ఆగష్టు కల్లా ఎట్టిపరిస్తితుల్లో వారణాసి షూటింగ్ ఫినిష్ చెయ్యాలని రాజమౌళి ప్లాన్ చేసుకున్నారు.

అయితే వారణాసి చిత్రానికి సంబందించిన డిజిటల్ హక్కులు అన్ని వందల కోట్లకి అమ్ముడుపోయాయి, ఇన్ని వందల కోట్లకి అమ్ముడు పోయాయనే ప్రచారం ఉంది. కానీ వారణాసి శాటిలైట్, డిజిటల్, థియేటర్ ఇలా అన్ని హక్కులు తీసుకునేందుకు ఇప్పుడు ఓ ప్రముఖ సంస్థ వారణాసి మేకర్స్ తో డిస్కర్షన్స్ పెట్టినట్టుగా తెలుస్తుంది.

ప్రముఖ నిర్మాణ సంస్థ జీ వారణాసి కి సంబందించిన థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ హక్కులు తీసుకునేందుకు వారణాసి మేకర్స్ తో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఆ డీల్ సెట్ అయితే ఆ ఫిగర్ ఎంత ఉంటుంది అనేది ఇప్పుడు హాట్ హాట్ గా కొత్త చర్చకు తెరలేపారు. 
 

Varanasi movie update