ప్రభాస్ ట్రిపుల్ ధమాకా

Prabhas's Triple Dhamaka

 

ప్రభాస్ నుంచి ట్రిపుల్ ధమాకా రాబోతుంది. అదేదో ఆయన బర్త్ డే కి కాదు. ప్రభాస్ ట్రిపుల్ ధమాకా అభిమానులకు అందించబోతున్నారు. ఎప్పుడు రిలాక్డ్స్ గా సినిమాలు చేసే ప్రభాస్ ఇప్పుడు ఏక కాలంలో మూడు సినిమాల షూటింగ్స్ లో పాల్గొనబోతున్నారు. ఇప్పటికే స్పిరిట్-ఫౌజీ షూటింగ్స్ పారలాల్ గా చేస్తున్నారు.

ఇకపై ఆయన కల్కి 2 షూటింగ్ లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. సందీప్ రెడ్డి వంగ, హను రాఘవాపుడి లతో స్పిరిట్-ఫౌజీ షూటింగ్స్ ని మండే ఎండా కాలంలో ప్రభాస్ పూర్తి చేస్తున్నారు. ఫౌజీ చిత్రాన్ని త్వరగా ఫినిష్ చెయ్యాలని, స్పిరిట్ చిత్రాన్ని నవంబర్, డిసెంబర్ కల్లా పూర్తి చెయ్యాలని ప్రభాస్ చూస్తున్నారు.

ఈలోపే దర్శకుడు నాగ్ అశ్విన్ కల్కి 2 ని పట్టాలెక్కించేసి రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసి ప్రభాస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ జాయిన్ అయితే లెంతి షెడ్యూల్స్ ప్లాన్ చేసి కల్కి 2 షూటింగ్ పరుగులు పెట్టించే ప్లాన్ లో ఉన్నారు. సో ప్రభాస్ ఇకపై స్పిరిట్, ఫౌజీ, కల్కి 2 షూటింగ్స్ ని ఏక కాలంలో చెయ్యడమంటే ఫ్యాన్స్ కి త్రిపుల్ ధమాకానే కదా...

ఇకపై ఆరు నెలలకో సినిమాతో ఫ్యాన్స్ ని ప్రభాస్ సర్ ప్రైజ్ చేస్తారు. ఫౌజీ డిసెంబర్, మార్చ్ లో స్పిరిట్, వచ్చే ఏడాది డిసెంబర్లో కల్కి 2 ఉంటె ఉండొచ్చు, లేదంటే 2028 సంక్రాంతికి కల్కి 2 దిగొచ్చన్నమాట.

Prabhas Set to Deliver a Triple Blast in Just One Year