ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Can KVN Handle Toxic, Jana Nayagan Troubles

జన నాయకుడు-టాక్సిక్ రెండూ.. రెండే

Can KVN Handle Toxic, Jana Nayagan Troubles


పాపం కెవిన్ ప్రొడక్షన్.. కేడి ద డెవిల్ తో డిజాస్టర్ చూసిన ఈ నిర్మాణ సంస్థ ఇప్పుడు జన నాయకుడు, టాక్సిక్ మూవీ ల విడుదల విషయంలో నలిగిపోతుంది. విజయ్ జన నాయకుడు విడుదలవుతుందో, లేదో అనే విషయం క్లారిటీ లేదు. ఇక యశ్ టాక్సిక్ ని ఎప్పుడు విడుదల చేయాలో తెలియడం లేదు.

అటు విజయ్ జన నాయకుడు చిత్ర డిస్ట్రిబ్యూటర్స్ కి డబ్బులు వెనక్కి ఇచ్చేశారనే టాక్ ఉంది, ఇటు టాక్సిక్ అప్పులు తడిచిమోపుడవుతున్నాయి. జన నాయకుడు ఎప్పుడు విడుదలైనా నిర్మాతలకు డబ్బులొస్తాయని అంటున్నా, అది ఎప్పుడు రిలీజ్ ఉంటుందో అర్ధం కావడం లేదు.

మరో పక్క టాక్సిక్ చిత్రానికి రీ షూట్స్ భారం ఎక్కువైంది. టాక్సిక్ భారీ బడ్జెట్ తో తెరకెక్కింది, కానీ టీజర్ విషయంలో అనుకున్న రెస్పాన్స్ రాలేదు. దానితో టాక్సిక్ ని వాయిదా వేసి రీ షూట్స్ చేస్తున్నారనే టాక్ ఉంది. మరి ఇవన్నీ కెవిఎన్ ప్రొడక్షన్ కి తలనెప్పి వ్యవహారాలే. ఈ సినిమాల్తో ఆర్ధికంగా ఈ నిర్మాణ సంస్థ చితికిపోవడం ఖాయమంటున్నారు.

Jana Nayagan and Toxic