Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Katrina Kaif Special Focus on Comeback

కమ్ బ్యాక్ పై కత్రినా స్పెషల్ ఫోకస్

Katrina Kaif Special Focus on Comeback

 

బాలీవుడ్ లో ఎన్నో ప్రేమ కథలు నడిపిన కత్రినా కైఫ్ చివరికి విక్కీ కౌశల్ ని ప్రేమించి సీక్రెట్ గా ప్రేమ వివాహం చేసుకుంది. స్పెషల్ సాంగ్స్, అలాగే ప్రత్యేక పాత్రలతో తనకంటూ మంచి ఇమేజ్ సంపాదించుకున్నప్పటికీ హీరోయిన్ గా మాత్రం నిలదొక్కుకోలేకపోయింది. విక్కీ కౌశల్ తో వివాహం తర్వాత కూడా నటనను కొనసాగించింది.

ఇక రీసెంట్ గా బేబీ కి జన్మనిచ్చిన కత్రినా కైఫ్ తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఇప్పుడు కెరీర్ పై ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. మళ్ళీ కెరీర్ లో బిజీ అయ్యే ప్రయత్నాల్లో కత్రినా కైఫ్ ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి అలియా భట్, దీపికా పదుకొనె, కియారా అద్వానీ లు పిల్లలు పుట్టాక మళ్లీ వర్కౌట్స్ చేసి ఫిట్ గా తయారవడమే కాదు కెరీర్ లో బిజీ అయ్యారు.

అలానే కత్రినా కైఫ్ కూడా ఇప్పుడు బేబీ సంరక్షణతో పాటుగా ఫిట్ గా కెరీర్ లో బిజీ అయ్యేందుకు చూస్తుంది అని తెలుస్తుంది. మరి ఆమె రీ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో చూడాలి.

Finally Katrina Kaif is back in the spotlight