Advertisement

దృశ్యం 3 ఓటీటీ డేట్ వస్తోంది

Drishyam 3 OTT Update


మలయాళంలో జీతూ జోసెఫ్ తెరకెక్కించిన దృశ్యం సీరీస్ ఎంత పెద్ద హిట్ అనేది అందరికి తెలిసిన విషయమే. దృశ్యం పార్ట్ 1, పార్ట్ 2 లు మంచి హిట్ అయ్యాయి. ఆ సీరీస్ లో వచ్చిన దృశ్యం 3 డివైడ్ టాక్ తోనే అద్భుతమైన కలెక్షన్స్ తీసుకొచ్చింది. మోహన్ లాల్ స్టామినా, దృశ్యం సీరీస్ పై ఉన్న హైప్ పార్ట్ 3 థియేటర్స్ లో హిట్ అయ్యేలా చేసింది.

ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.250 కోట్లు కలెక్ట్ చేసిన దృశ్యం 3 ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అవుతుంది. దృశ్యం 3 ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ డీల్ తో సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ చెయ్యబోతున్నట్టుగా తెలుస్తుంది.

అమెజాన్ ప్రైమ్ దృశ్యం 3 చిత్రాన్ని జూన్ 18 కానీ లేదంటే జూన్ 25 నుంచి కానీ స్ట్రీమింగ్ లోకి తెచ్చే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ చిత్రం మే 21 న థియేటర్స్ లో విడుదలైంది.  

Drishyam 3 On OTT From This Date