టాక్సిక్ రీ షూట్ పై క్లారిటీ

Yash Must End Toxic Rumours


టాక్సిక్ చిత్రం మార్చి 19 నుంచి వాయిదాపడి జూన్ 4 న మళ్ళీ రిలీజ్ అంటూ మేకర్స్ గ్రాండ్ గా డేట్ లాక్ చేసారు. కానీ జాన్ 4 నుంచి కూడా టాక్సిక్ ని మరోసారి పోస్ట్ పొన్ చేసారు. ఈ చిత్ర టీజర్ అంతగా ఇంపాక్ట్ చూపించలేదు, అందుకే టాక్సిన్ ని వాయిదా వేసి రీ షూట్ చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది.

మరోపక్క ఓటీటీ డీల్ పూర్తి కానీ కారణంగా టాక్సిక్ చిత్రం పోస్ట్ ఫోన్ అయ్యింది అంటున్నా ఈ రీ షూట్ న్యూస్ మాత్రం తెగ వైరల్ అవుతుంది. దానితో మేకర్స్ హడావిడిగా లైన్ లోకి వచ్చి టాక్సిక్ రీ షూట్ వార్తలను కొట్టి పారేసింది. అంతేకాదు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, ఫైనల్ కంటెంట్ సిద్ధంగా ఉందని మేకర్స్ ఈ రూమర్లకు గట్టిగా చెక్ పెట్టారు.

ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లాంగ్వేజెస్ అలాగే ఇంగ్లీష్ భాషలో కూడా ఒకేసారి విడుదల చేస్తుండటంతో, యష్ ప్రస్తుతం ఇంటర్నేషనల్ వేదికలపై సినిమాను భారీగా ప్రమోట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. 

Toxic Rumours Crushed: Yash Film Gives Clarity