పవన్ కు మరోసారి అస్వస్థత
Pawan Kalyan Faces Health Issue
ఏపీ డిప్యూటీ సీఎం ఈ మధ్యన తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారు. కొద్దిరోజుల ముందు సైనస్ ఆపరేషన్ చేయించుకున్న పవన్ కళ్యాణ్ అప్పుడు చాలా రోజులు హైదరాబాద్ లోనే తన ఇంట్లో రెస్ట్ తీసుకున్నారు. అప్పుడు ప్రధాని మోడీ కూడా పవన్ ఇంటికి వెళ్లి పరామర్శించి వచ్చారు.
ఆతర్వాత ఆయన కోలుకుని ఏపీ అధికారిక కార్యక్రమాల్లో బిజీ అయ్యారు. రీసెంట్ గా హైదరాబాద్ లో తన ఇంటి వద్దే తెలంగాణాలో పార్టీ బలోపేత ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఇక ఈ రోజు ఏపీ కేబినేట్ సమావేశంలో పాల్గొనేందుకు అమరావతి వెళ్లారు. అక్కడ క్యాబినేట్ సమావేశం జరుగుతున్న సమయంలో పవన్ ఉన్నట్టుండి సమావేశం మధ్యలో వెళ్లిపోయారు.
కారణం పవన్ కళ్యాణ్ వెన్ను నొప్పితో ఇబ్బంది పడుతూ కూర్చోలేని స్థితిలో ఆ మీటింగ్ నుంచి వెళ్లిపోయారని తెలుస్తుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వెళ్లి అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.







































