కేరీర్ పీక్స్ లో విజయ్ ఇలా: రామ్ చరణ్
Ram Charan congratulates Tamil Nadu CM Vijay
పెద్ది ప్రమోషన్స్ చెన్నై కి చేరాయి. ముంబై, భోపాల్, బెంగుళూరు, ఢిల్లీ తర్వాత చెన్నై కి చేరుకున్న రామ్ చరణ్ ఈరోజు అక్కడ చెన్నై ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఎక్కడికి వెళ్లినా పెద్దిని ప్రమోట్ చెయ్యడమే కాదు అక్కడి రాజకీయనాయకుల గురించి చరణ్ గొప్పగా మాట్లాడుతున్నారు. తాజాగా చెన్నై ప్రెస్ మీట్ లో హీరో నుంచి సీఎం స్థాయికి చేరిన విజయ్ పై చరణ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ అందుకున్న సీఎం విజయ్‌కు రామ్ చరణ్ పెద్ది ప్రెస్ మీట్ లో హృదయపూర్వక అభినందనలు తెలిపారు. విజయ్ తన కెరీర్ పీక్స్‌లో ఉండగా ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి వెళ్లారని.. ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని రామ్ చరణ్ సీఎం విజయ్ ని పొగిడేశారు.
మరి రామ్ చరణ్ సీఎం విజయ్ ని పొగిడేసి ఆయన అభిమానులను తన పక్కకు చేరేలా చేసుకున్నప్పటికీ.. పెద్ది పై ఉన్న అంచనాలు తమిళనాట కూడా పెద్ది కి మంచి హిట్ కట్టబెట్టడం ఖాయమనే మాట ట్రేడ్ వర్గాల నుంచి వినిపిస్తుంది. ఇక పెద్ది ప్రమోషన్స్ పాన్ ఇండియా మార్కెట్ లో ముగియగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదలు కాబోతున్నాయి.







































