Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> A.R. Murugadoss Calls Salman Unprofessional

వారిద్దరి పుండు మీద మ‌ళ్లీ మ‌ళ్లీ కారం!

A.R. Murugadoss Calls Salman Unprofessional

 

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్-  స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రిలీజ్ అయిన  `సికందర్` బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా వైఫల్యం తర్వాత ఇద్ద‌రి మధ్య తీవ్ర విభేదాలు త‌లెత్తాయి. భారీ ప్రాజెక్ట్ పరాజయం పాలైనప్పుడు హుందాగా అంగీకరించకుండా? ఇద్దరూ బహిరంగంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది. తాజాగా సామాజిక మాధ్యమాల్లో ఇద్ద‌రి పాత ఇంటర్వ్యూలు, వీడియో క్లిప్‌లు మళ్లీ తెరపైకి రావడంతో  వివాదం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.

మురుగదాస్ ఓ పాడ్‌కాస్ట్‌లో సల్మాన్ ఖాన్ పనితీరుపై చేసిన సంచలన వ్యాఖ్యలను నెటిజన్లు ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. ఆ ఇంటర్వ్యూలో మురుగదాస్ మాట్లాడుతూ సల్మాన్ షూటింగులకు ఆలస్యంగా రావడం వల్ల సహ నటీనటులు, ముఖ్యంగా చైల్డ్ ఆర్టిస్టులు రాత్రి వేళల్లో నిద్రపోతూ తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. పగలు తీయాల్సిన సన్నివేశాలను సైతం సల్మాన్ లేట్ రాక వల్ల అర్ధరాత్రి దాటిన తర్వాత చిత్రీకరించాల్సి వచ్చిందని, దీనివల్ల సినిమాను ఎక్కువగా గ్రీన్ స్క్రీన్, సీజీ  సెట్లలోనే పూర్తి చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

అంతేకాదు ఎంతో బలంగా రాసుకున్న స్క్రిప్ట్‌లో సల్మాన్ ఇష్టానుసారంగా మార్పులు చేయించడం కూడా సినిమా దారుణమైన ఫలితానికి కారణమైందని మురుగదాస్ ఓపెన్ అయ్యారు. సినిమా రంగంలో గెలుపోటములు సహజమని, ఒక వైఫల్యం తర్వాత పాత విషయాలను తవ్వి తీస్తూ సోషల్ మీడియా వేదికగా నిరంతరం చర్చలు జరపడం చిత్ర పరిశ్రమ వాతావరణాన్ని దెబ్బతీస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సల్మాన్- మురుగదాస్ ఇద్దరూ తమ రంగాల్లో ఎన్నో మైలురాళ్లు అందుకున్న దిగ్గజాలు. కాబ‌ట్టి పాత వివాదాన్ని నెటిజ‌న‌లు స‌హా స‌ల్మాన్..ముర‌గ‌దాస్ మ‌ళ్లీ ట‌చ్ చేయ‌క‌పోవ‌డం మంచిది.
 

AR Murugadoss Seemingly exposes the Chaos Behind Working with Salman Khan