Loading...

పెద్ది టీమ్ కి చిక్కారో.. ఇక అంతే

Peddi Movie Team


కొన్నాళ్లుగా ఒక హీరో సినిమా వస్తుంది అంటే మరో హీరో అభిమానులు ఆ సినిమాపై నెగెటివ్ గా ట్వీట్లు చెయ్యడం, ట్రోల్స్ చెయ్యడం అనేది  సోషల్ మీడియాలో పరిపాటిగా మారింది. ఒక హీరో ఎదుగుదలను చూసి మరో హీరో ఫ్యాన్స్ కుళ్ళు కోవడం మాములు విషయమే. కానీ అది నెగిటివిటి రూపంలో సోషల్ మీడియాలో విషం చిమ్ముతున్నారు.

ఇప్పుడు పెద్ది సినిమా విడుదలకు రెడీ అయిన నేపథ్యంలో పెద్దిపై నెగెటివ్ ట్వీట్లు, అలాగే అసత్య ప్రచారాలు చేసే వారిని వేటాడి, వేటాడుతుంది చిత్ర బృందం. ఇప్పటికే మద్రాస్ హైకోర్టు సినిమా విడుదలయ్యాకా ఆ సినిమాలోని సీన్స్, సాంగ్స్ ఇలా ఏవి సోషల్ మీడియాలో, ఇంటర్నెట్ లో పెట్టకుండా, కాపీ చేయడాన్ని నిరోధిస్తూ న్యాయస్థానం ఈ ఆదేశాలిచ్చింది.

తాజాగా గుంటూరు, హైదరాబాద్ కి చెందిన ఇద్దరు వ్యక్తులు కావాలనే పెద్ది చిత్రంపై రూమర్స్ ప్రచారం చేస్తున్న విషయం పెద్ది టీమ్ దృష్టికి రాగా.. దానితో ఆధారాలను సేకరించిన చిత్రబృందం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. సో పెద్ది పై ఎవరైనా కావాలని నెగిటివిటి చూపిస్తే ఇక వారి పని ఇంతే.

Peddi Movie Update