Loading...

రోజులు లెక్కెట్టుకుంటున్న అక్కినేని ఫ్యాన్స్

Akkineni fans are counting the days

 

అక్కినేని యువ హీరో అఖిల్ సక్సెస్ కోసం ఆయనెంత కష్టపడుతున్నాడో తెలియదు కానీ అక్కినేని అభిమానులు మాత్రం అఖిల్ కి సక్సెస్ దక్కాలని మొక్కని దేవుడు లేదు, ఎదురు చూడని రోజు లేదు. జూన్ 26 న విడుదల కాబోతున్న లెనిన్ కోసం సోషల్ మీడియాలో యుద్ధమే మొదలు పెట్టారు.

లెనిన్ రిలీజ్ కి ఇంకా 28 రోజులున్నాయి, 27 రోజులు ఉన్నాయి, మనోడు వస్తున్నాడు అంటూ ట్వీట్లు వెయ్యడమే కాదు.. లెనిన్ అప్ డేట్స్ తో సోషల్ మీడియా తగలడిపోవాలంటూ నిర్మాత నాగవంశీ ని కోరుతూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. చడీ చప్పుడు చెయ్యకుండా లెనిన్ టీజర్ అక్కినేని అభిమానులను సర్ ప్రైజ్ చేసింది.

అఖిల్ విలేజ్ కుర్రాడిగా, మాస్ కేరెక్టర్ లో అద్భుతంగా కనిపించాడు, లెనిన్ తో అక్కినేని యువ హీరో అయ్యగారు అఖిల్ హిట్ పక్కాగా కొడతాడంటూ అక్కినేని ఫ్యాన్స్ హడావిడి ఎక్కువైంది. దర్శకుడు మురళి కోశోర్ అబ్బూరి టీజర్ తో మాయ చేసినట్టుగానే ట్రైలర్ తోనూ మెస్మరైజ్ చెయ్యాలి, లెనిన్ ట్రైలర్ తోనే హిట్టు బొమ్మ అని లెనిన్ పై ప్రేక్షకులు ఒపీనియన్ మారిపోవాలంటూ మాట్లాడుకుంటున్నారు.

మరి లెనిన్ తో అఖిల్ కొట్టబోయే హిట్టు కోసం అక్కినేని అభిమానులు కోటి ఆశలతో వెయిట్ చేస్తున్నారు. చూద్దాం అయ్యగారి లక్కు ఎలా ఉందొ అనేది. 
 

Lenin update