పెద్ది ప్రీమియర్ షో టికెట్ ధర ఎంతంటే
Peddi: Premiere show tickets in Andhra Pradesh
ఐదు నెలలుగా నిస్తేజంగా పడిఉన్న బాక్సాఫీసును తట్టి లేపేందుకు రామ్ చరణ్ పెద్ది చిత్రం రెడీ అయ్యింది. భారీ బడ్జెట్ చిత్రం, విపరీతమైన హైప్ ఉన్న చిత్రం పెద్ది తో ఫస్ట్ హాఫ్ ని ముగించేందుకు టాలీవుడ్ కూడా సిద్ధమైంది. అయితే భారీ బడ్జెట్ మూవీ కావడంతో ఈ చిత్రానికి టికెట్ రేట్లు పెంచుకునేందుకు నిర్మాతలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు అర్జీలు పెట్టుకున్నారు.
ప్రీమియర్ షో ధర, అలాగే మిగతా షోస్ కి టికెట్ రేట్లు అదనంగా పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించమంటూ అడుగుతున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం పెద్ది నిర్మాతలకు గుడ్ న్యూస్ చెప్పింది. పెద్ది సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు, జూన్ 3 రాత్రి 8 గంటలకు స్పెషల్ ప్రీమియర్ షో వేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.
ప్రీమియర్ షోకు టికెట్ ధర రూ.600, అలాగే సినిమా విడుదలయ్యే 4 నుంచి 10 రోజుల పాటు ప్రస్తుతమున్న టికెట్ ధరలపై సింగిల్ స్క్రీన్లలో రూ.100 చొప్పున, మల్టీప్లెక్స్ ల్లో రూ.125 చొప్పున పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అవకాశ మిచ్చింది. అంతేకాకుండా వీటితో పాటు రోజుకు 5 షోలు ప్రదర్శించుకునేందుకు వీలు కల్పిస్తూ ఉత్తర్వులిచ్చారు.






































