Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Mahesh's one-man show...will leave you speechless!

మ‌హేష్ వ‌న్ మ్యాన్ షో..దిమ్మ తిరిగిపోయేలా!

Mahesh's one-man show...will leave you speechless!

 

సూపర్‌స్టార్ మహేష్ - రాజ‌మౌళి  కాంబినేషన్‌లో తెర‌కెక్కుతోన్న అడ్వెంచర్ చిత్రం `వారణాసి`. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్  సినిమాలోని అత్యంత కీలకమైన, హై-వోల్టేజ్ యాక్షన్ షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తోంది. మహేష్ ను మునుపెన్నడూ చూడని రీతిలో  పవర్‌ఫుల్ అడ్వెంచరర్ పాత్రలో ఆవిష్కరించేందుకు జర్మనీలో కఠిన శిక్షణ ఇప్పించిన జక్కన్న ఇప్పుడు దానికి తగ్గట్లే హాలీవుడ్ స్థాయి స్టంట్స్ కంపోజ్ చేయించే పనిలో పడ్డారు.

ఈ  యాక్షన్ షెడ్యూల్ కోసం అంతర్జాతీయ స్థాయికి చెందిన ప్రముఖ స్టంట్ మాస్టర్స్ -హాలీవుడ్ యాక్షన్ కోఆర్డినేటర్లు రంగంలోకి దిగనున్నారు. మహేష్  జర్మనీ బ్లాక్ ఫారెస్ట్‌లో నేర్చుకున్న విదేశీ యుద్ధ విద్యలు, ట్రెకింగ్,  వైర్-వర్క్ బ్యాలెన్సింగ్ మెళకువలను ఈ షెడ్యూల్‌లోనే కెమెరా ముందు పూర్తిగా ఉపయోగించ బోతున్నారట. అత్యంత ప్రమాదకరమైన ఛేజింగ్ సీక్వెన్స్ లు, అడవుల నేపథ్యంలో సాగే వినూత్న ఫైట్స్ ఈ షెడ్యూల్ లోనే చిత్రీకరించడానికి రాజమౌళి పక్కా ప్లానింగ్ సిద్ధం చేశారు. దీనికోసం ప్రత్యేకమైన సెట్స్ - విదేశీ లొకేషన్లను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

సాధారణంగా రాజమౌళి సినిమాల్లో యాక్షన్ సీన్స్ అంటే కేవలం ఫైట్స్ మాత్రమే కాదు, అవి కథను ముందుకు నడిపించే ఎమోషనల్ టర్నింగ్ పాయింట్స్ లా ఉంటాయి. అందువల్ల ఈ యాక్షన్ షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ భారీగా సమయాన్ని, బడ్జెట్‌ను కేటాయించింది. `ఆర్ఆర్ఆర్` చిత్రంతో అంతర్జాతీయంగా యాక్షన్ సీక్వెన్స్ లలో సరికొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేసిన రాజమౌళి ఈ చిత్రంతో ఆ రికార్డులను తిరగరాయాలని చూస్తున్నారు. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఈ ఒక్క యాక్షన్ షెడ్యూల్ అవుట్‌పుట్ చూశాక బిజినెస్ పరంగా ఈ సినిమా రేంజ్ గ్లోబల్ మార్కెట్‌లో మరో స్థాయికి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

Mahesh Babu Varanasi