Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Sharvari talks about her upcoming film, Main Vaapas Aaunga

ఆల్పా బ్యూటీ స‌రికొత్త ప్ర‌యోగం!

Sharvari talks about her upcoming film, Main Vaapas Aaunga

 

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో  గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా కెరీర్ ఆరంభం నుంచే వైవిధ్యమైన ఛాలెంజింగ్ రోల్స్‌ను ఎంచుకుంటూ దూసుకుపోతోంది యంగ్ బ్యూటీ శర్వరి వాగ్. `ముంజ్యా`, `వేదా` వంటి చిత్రాలతో నటిగా విలక్షణమైన కోణాన్ని నిరూపించుకున్న అమ్మ‌డు తాజాగా మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. సాధారణంగా నటీనటులకు తమ నటనా సామర్థ్యాన్ని వంద శాతం ఆవిష్కరించేందుకు పీరియాడిక్ నేపథ్యం ఉన్న కథలు ఎంతగానో దోహదపడతాయి. ఈ క్రమంలోనే శర్వరి ఒక భారీ పీరియాడిక్ రోల్ లో కనిపించబోతుండటం ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఈ సరికొత్త మైనా వాప‌స్ అవుంగా ప్రాజెక్ట్‌లో ఆమె పాత్ర ఎంతో పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని?  `మైన్ వాపస్ ఆవుంగా` అనే ఇంటెన్స్ థీమ్  డైలాగ్ చుట్టూ ఈ కథాంశం తిరగనుందని సమాచారం. పునర్జన్మ ఒక శక్తివంతమైన ప్రతికారం నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ క్యారెక్టర్ కోసం శర్వరి  లుక్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీని పూర్తిగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఆధునిక కాలపు యాక్షన్, గ్లామర్ పాత్రల నుండి ఒక్కసారిగా వింటేజ్  సాంప్రదాయ శైలిలోకి మారి  బరువైన పాత్రను పోషించడం కెరీర్‌లోనే  మైలురాయిగా నిలిచిపోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

నేటి తరం బాలీవుడ్ నాయికలు కేవలం పెద్ద హీరోల పక్కన కమర్షియల్ సినిమాల్లో పాటలకే పరిమితం కాకుండా తమ భుజస్కంధాలపై కథను నడిపించే సత్తా ఉన్న పాత్రల వైపు మొగ్గు చూపుతున్నారు. శర్వరి వాగ్ తీసుకుంటున్న ఇలాంటి బోల్డ్ డెసిషన్స్ ఆమెను తోటి హీరోయిన్ల రేసులో  ముందంజలో ఉంచుతున్నాయి. భారీ అంచనాలున్న ఈ పీరియాడిక్  డ్రామా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో? `మైన్ వాపస్ ఆవుంగా` అనే ఇంటెన్స్ కాన్సెప్ట్ నేటి తరం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.

Sharvari reveals Punjab dresser inspires her role in Main Vaapas Aaunga