విజయ్ సీఎం అయినా JN కి మోక్షం లేదు
Jana Nayagan producer confirms Vijay’s film still stuck at CBFC
తమిళనాడు ప్రభుత్వం మారింది, సీఎం గా స్టాలిన్ దిగిపోయి సినిమా వాడు విజయ్ సీఎం అయ్యాడు. అయినప్పటికీ సీఎం విజయ్ నటించిన జన నాయగన్ చిత్రానికి మోక్షం లేదు. సెన్సార్ ప్రోబ్లెంస్ తో జన నాయగన్ వాయిదాపడింది. విజయ్ సీఎం అయ్యాక జన నాయగన్ కష్టాలు తీరిపోతాయని అనుకున్నారు.
కానీ ఇప్పటికి జన నాయగన్ కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటికి జన నాయగన్ కి సెన్సార్ పూర్తవ్వలేదట. అదే విషయాన్ని నిర్మాత వెంకట్ కె. నారాయణ చెబుతున్నారు. ఆయనొక గుడికి వెళ్ళినప్పుడు మీడియా వారు జన నాయగన్ సెన్సార్ గురించి అలాగే దానికి ఉన్న చిక్కులు వదిలిపోయాయా అని అడిగితే.. దానికి ఆయన తటపటాయిస్తూ..
జన నాయగన్ గురించి మాట్లాడానికి ఇది సరైన వేదిక కాదు. నేను ఆలయ దర్శనానికి వచ్చాను. కానీ ఒకటి చెప్పాలనుకుంటున్నా.. ఇప్పటికీ జన నాయగన్ కు సెన్సార్ సర్టిఫికెట్ రాలేదు. దానికోసమే వేచి చూస్తున్నాం. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించి, సినిమాను ప్రేక్షకుల ముందుకుతీసుకొస్తాం.. అంటూ చెప్పడం చూసాక విజయ్ సీఎం అయినా జన నాయగన్ కష్టాలు ఇంకా తీరలేదా అంటూ అభిమానులే కామెంట్లు పెడుతున్నారు.







































