Loading...

ఒక్కసారిగా ఫామ్ లోకొచ్చిన లెనిన్

Lenin Movie Update


అక్కినేని అభిమానులు ఉపిరి పీల్చుకుంటున్నారు. అయ్యగారు అఖిల్ కి లెనిన్ తో గట్టిగా హిట్ పడాలని వారు మొక్కని దేవుళ్ళు లేరు. అఖిల్ లెనిన్ తో బౌన్స్ బ్యాక్ అవ్వాలని వారి కోరిక. అందుకే లెనిన్ చిత్ర అప్ డేట్స్ కోసం నిర్మాత నాగవంశీ పై అక్కినేని అభిమానులు ఒత్తిడి పెంచారు. అభిమానులను సడన్ సర్ ప్రైజ్ చేస్తూ మేకర్స్ లెనిన్ టీజర్ ఇచ్చేసారు.

లెనిన్ టీజర్ లో అఖిల్ ని చూసి అక్కినేని అభిమానులు మనోడు వచ్చేసాడు, జునే 6 న హిట్ పక్కా అంటూ ఫిక్స్ అవడమే కాదు లెనిన్ పై వారు కాన్ఫిడెంట్ తో కనిపిస్తున్నారు. నిన్నటివరకు కామ్ గా కనిపించిన లెనిన్ ఒక్కసారిగా ఫామ్ లోకి వచేసింది. అఖిల్ నిజమే చెప్పాడు.
సినిమా అప్ డేట్స్ తో హడావిడి కాదు కంటెంట్ మాట్లాడాలి అని.

నిజమే లెనిన్ చూస్తుంటే కంటెంట్ మాట్లాడలాగే కనిపిస్తుంది. మరి టీజర్ కి వచ్చిన క్రేజ్ తో అఖిల్ నుంచి వచ్చే అప్ డేట్స్ అంతే వైరల్ అయితే లెనిన్ గెలిచినట్టే. చూద్దాం లెనిన్ తో జూన్ 26 న అఖిల్ ఎలాంటి రిజల్ట్ అందుకోబోతున్నాడో అనేది.  
 

Lenin Movie