పెద్ది వాళ్ళను ఒడ్డున పడేస్తుందా


పెద్ది చిత్ర నిర్మాతలకు పెద్ది హిట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. పెద్ది పై భారీ అంచనాలున్నాయి. ఓపెనింగ్స్ పరంగా పెద్ది బ్లాక్ బస్టర్ నెంబర్లు నమోదు చెయ్యడం గ్యారెంటీ. ఏ మాత్రం హిట్ టాక్ వచ్చినా వందల కోట్లు కొల్లగొట్టడం ఖాయం. కొట్టలేదంటే పెద్ది నిర్మాతలు ఇప్పట్లో కోలుకోవడం కష్టం.

కారణం మైత్రి మూవీ వారికి మూడు చిత్రాలు వరసగా షాకిచ్చాయి. భారీ బడ్జెట్ చిత్రాలుగా తెరకెక్కించిన హరి హర వీరమల్లు, రాజాసాబ్, ఉస్తాద్ భగత్ సింగ్ మూడు చిత్రాలు మైత్రి నిర్మాతలకు భారీ నష్టాలు మిగిల్చాయి. పెద్ద హీరోలు, పెద్ద సినిమాలు మూడూ నిర్మాతలకు బిగ్ షాకిచ్చాయి.

అందుకే పెద్ది పైనే వారు చాలా నమ్మకంతో ఉన్నారు. రామ్ చరణ్ పెద్ది తమను ఒడ్డున పడేస్తుంది అని చాలా కాన్ఫిడెంట్ తో కనిపిస్తున్నారు. మరి జూన్ 4 న పాన్ ఇండియా మార్కెట్ లో పెద్ది ఎలాంటి సంచలనాలు నమోదు చెయ్యబోతుందో జస్ట్ వెయిట్ అండ్ సి. 

Peddi Movie ,Peddi Movie Release