రాజమౌళిని ఫాలో అయిన నీల్


దర్శకధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ తో చేస్తున్న వారణాసి చిత్ర విషయాలేవీ బయటపెట్టకుండా, ఆఖరికి ఓపెనింగ్ సెర్మోని ని కూడా గుట్టు చప్పుడు కాకుండా చేసి 10 నెలల పాటు షూటింగ్ చేసి ఒకేసారి టైటిల్ గ్లింప్స్ ని, అలాగే సినిమాలో నటిస్తున్న నటుల వివరాలను, సినిమా విడుదల యేడాదిని, ఇలా చాలా విషయాలను ఒకే ఒక్క ఈవెంట్ లో రివీల్ చేసేసారు.

అదే మాదిరి అంటే రాజమౌళి ఎలా అయితే వారణాసి అప్ డేట్స్ ఒక్క ఈవెంట్ లో గుక్కతిప్పుకోకుండా అభిమానులకు అందించారో.. అదే విధంగా ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేస్తున్న పాన్ ఇండియా ఫిలిం డ్రాగన్ వివరాలను ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా వదిలిన గ్లింప్స్ తో ఫుల్ క్లారిటీ ఇచ్చేసారు.

గత ఏడాదిగా # NTRNeel అప్ డేట్ ఇవ్వలేదు. ఒక నెల ముందు రిలీజ్ డేట్ ఇచ్చారు తప్ప ఏడాది కాలంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని వెయిట్ చేయించిన ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ బర్త్ డే కి టైటిల్ గ్లింప్స్ తో అందులో నటిస్తున నటుల వివరాలను, సినిమా థీమ్ ని ఏడాదికి సరిపోయె విధంగా అప్ డేట్ అందించారు

ఒకే ఒక్క గ్లింప్స్ తోనే నీల్ అభిమానులకు భారీ ట్రీట్ ఇచ్చారు. మరి రాజమౌళి ఎలా అయితే చేసారో.. నీల్ ఆయన్నే ఫాలో అవుతూ చెయ్యడం ఒక విధంగా అభిమానులను సంతోషపెట్టేసింది. 
 

Rajamouli,Prashanth Neel follows Rajamouli